బీహార్ స్పెషల్ "లిట్టి చోఖా" ఈజీగా ఎలా చేయాలంటే..?

బీహార్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాంప్రదాయ వంటకం "లిట్టి చోఖా"(Litti Chokha). తక్కువ పదార్థాలతో, ఆరోగ్యకరంగా, రుచికరంగా తయారయ్యే ఈ వంటకం ఇప్పుడు దేశమంతటా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా నూనె తక్కువగా ఉపయోగించే హెల్తీ వంటకంగా కూడా ఇది అందర్నీ ఆకర్షిస్తోంది. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు పిండి.. కాల్చిన కూరగాయల వల్ల వచ్చే ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ దీనిని మరింత స్పెషల్ గా మారుస్తున్నాయి.

అలానే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా, ఓవెన్ లేకపోయినా తయారు చేసుకోగలగడం కూడా బాగా కలిసొచ్చే అంశం. ప్రత్యేకమైన రుచితో తయారయ్యే లిట్టి చోఖాను ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కుటుంబసభ్యులందరికీ నచ్చే ఈ బీహారీ స్పెషల్ మీ వంటింటికి కొత్త రుచిని తీసుకువస్తుంది. ఇప్పుడు ఈ టేస్టీ వంటకం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌ మీకోసం ప్రత్యేకంగా..

bihar-special-litti-chokha-making-recipe-in-telugu

లిట్టి చోఖా తయారీకి కావలసిన పదార్థాలు..

లిట్టి కోసం:

  • గోధుమ పిండి - 2 కప్పులు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • వాము (క్యారమ్ సీడ్స్) - ½ స్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • నీరు - అవసరమైనంత

పూరణం కోసం:

  • సత్తు (వేయించిన శనగపిండి) - 1 కప్పు
  • తురిమిన అల్లం - 1 స్పూన్
  • తరిగిన వెల్లుల్లి - 1 స్పూన్
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2 (తరిగినవి)
  • కొత్తిమీర ఆకులు - తగినంత
  • కలోంజి (ఉల్లి విత్తనాలు) - ½ స్పూన్
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
  • ఆవాల నూనె - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత

చోఖా కోసం:

  • వంకాయ - 1 పెద్దది
  • బంగాళదుంపలు - 2
  • టొమాటోలు - 2
  • ఆవాల నూనె - 1 టేబుల్ స్పూన్
  • తరిగిన వెల్లుల్లి - 1 స్పూన్
  • పచ్చిమిర్చి - 1-2
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొత్తిమీర ఆకులు - తగినంత

తయారీ విధానం..

లిట్టి పిండి తయారీ..

ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, వాము, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత నీరు వేసుకుంటూ మెత్తని కానీ కొంచెం గట్టిగా ఉండే పిండిలా ముద్ద చేయాలి. 15-20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి.

పూరణం తయారీ..

సత్తు పిండిలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కలోంజి, నిమ్మరసం, ఆవాల నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం తడి తడిగా ఉండాలి.

లిట్టి తయారు చేయడం..

పిండిని చిన్న ఉండలుగా చేసి, చేతితో మధ్యలో గోతులు చేసి అందులో సత్తు పూరణం నింపాలి. అంచులను ముడివేసి గుండ్రంగా బంతుల్లా తయారు చేయాలి.

లిట్టి కాల్చడం..

సాంప్రదాయంగా బొగ్గు నిప్పులపై కాల్చుతారు. ఇంట్లో అయితే తవాలో తక్కువ మంటపై తిప్పుతూ కాల్చవచ్చు. ఓవెన్‌లో 180°C వద్ద 25-30 నిమిషాలు, ఎయిర్ ఫ్రైయర్‌లో 180°C వద్ద 15-20 నిమిషాలు.. బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.

చోఖా తయారీ..

వంకాయ, బంగాళదుంపలు, టొమాటోలను నేరుగా మంటపై లేదా ఓవెన్‌లో కాల్చి తొక్క తీసేయాలి. వాటిని చేతులతో లేదా ముద్దపెట్టి మెత్తగా చేయాలి. అందులో ఆవాల నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

వడ్డించే విధానం..

వేడి వేడి లిట్టీలను కొద్దిగా నెయ్యిలో ముంచి, పక్కన చోఖాతో పాటు వడ్డించాలి. కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ ముక్కలు కూడా జోడించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+