మధుమేహానికి శాశ్వత పరిష్కారం ఉంది తెలుసా?
అందరూ ఇష్టంగా తినే పండ్ల జాబితాలో జామ కూడా ఉంటుంది. ఇది మంచి రుచినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలవల్ల శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇప్పటివరకు అందరూ ఆకుపచ్చ లేదంటే ఎరుపురంగు జామ పండ్లను చూసివుంటారు.. లేదంటే తినివుంటారు. మీరు ఇంతవరకు ఎన్నడూ చూడని నల్ల జామపండు గురించి తెలుసుకుందాం.
నల్ల జామపండు శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మనదేశంలో ఎంతో అరుదుగా లభిస్తాయి. ధర కూడా చాలా ఎక్కువ. వీటి గుజ్జు కూడా నల్లగానే ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలున్నాయి. ప్రతిరోజు తినడంవల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులువుగా తగ్గిపోతాయి. నల్లజామలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు దీన్ని తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి సులువుగా పరిష్కారం దొరుకుతుంది.

చాలామంది రక్తహీనతతో బాధపడుతుంటారు. అటువంటివారు నల్ల జామను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఎర్ర రక్త కణాల సంఖ్యను ఇది పెంచుతుంది. ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోనే ఉంటాయి. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తీవ్రమైన మధుమేహంతో బాధపడేవారు నల్లజామను తప్పకుండా తినాలి.












Click it and Unblock the Notifications