రోజూ మిరియాలు తింటే - ఈ సమస్యలకు దివ్యౌషధం..!!

మిరియాలు సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. పలు రకాల సమస్యలకు దివ్యౌషధం. ఆహారంలో రుచితో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మిరియాల్లో సి, కె విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మిరియాల్లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో, ఇవి జీర్ణక్రియ నుంచి షుగరు నియంత్రణలోనూ మేలు చేస్తుంది. ఆరోగ్య పరంగా ఇతర సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.

మిరియాలు జీర్ణరసాలు, ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుం దని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్ చడంలో సహాయపడుతుంది. మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నిపు లు పేర్కొన్నారు. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయని.. వీటిని పాలు, పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. జ్వరాలు, గ్యాస్ట్రిక్, శ్వాసకోశ, మూత్ర వ్యాధుల ఆయుర్వేద చికిత్సలో దీనిని వినియోగించే వారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మిరియాలు శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని, తద్వారా ఒబెసిటీ నిరోధించడంలో సహాయపడుతుంది.

black-pepper-has-many-health-benefits-rectifies-the-lipid-profile

నల్లమిరియాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని, అంతేకాకుండా సైనస్, ఉబ్బసం, నాసి రద్దీని నయం చేస్తుందని, ఇది క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంద worldwidejournals అనే జర్నల్​ ప్రచురించింది. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసి, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. నల్ల మిరియాలు ప్రధాన ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్​, వివిధ క్యాన్సర్లలో యాంటీ ట్యూమర్ కార్యకలాపాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందులోని 'పైపెరిన్' అనే రసాయనం ఇన్సులిన్ సున్నితత్వా పెంచి, మధుమేహాన్ని సమర్థవం గా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసి, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. అయితే, దీర్ఘ కాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుడి సూచన మేరకే విరివిగా మిరియాలను వినియోగించటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+