కంటిచూపు మెరుగుపడాలా..? ఈ ఆహారాలను రోజూ తినండి..!
సర్వేద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అంటారు. కళ్లకు అంతటి ప్రాధాన్యత ఉంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నేళ్ల క్రితం వృద్ధాప్యంలో మాత్రమే కంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే విటమిన్ ఏ ఎంతో అవసరం అని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ ఏ తక్కువ ఉన్నావారికి రే చీకటి వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు వివరిస్తున్నారు.
కంటి ఆరోగ్యం కోసం విటమిన్ ఏ, సీ, ఈ లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్లు, నిమ్మజాతి పండ్లు, పాలకూర, యాపిల్స్, టమాటా వంటి ఆహారాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే కంటి చూపు కోసం చేపలు, అవిసె గింజలు, బాదం, పాల ఉత్పత్తులు, గుడ్లు, లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలట. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును సంరక్షిస్తాయని చెబుతున్నారు.
విటమిన్ ఏ తక్కువగా ఉంటే.. దృష్టి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే నైట్ బ్లైండ్ నెస్ (చీకటిలో సరిగ్గా చూడలేకపోవడం), అంధత్వం వచ్చే ప్రమాదం ఉందట. విటమిన్ ఏ లోపంతో చర్మం పొడిబారడం, చర్మం పొలుసులుగా మారడం లేదా దురదగా ఉండటం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. విటమిన్ ఏ లోపం కారణంగా రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోవడం, అలాగే విరేచనాలు, తట్టు.. లాంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక కంప్యూటర్ పై పని చేసేవాళ్లు తరచూ రెప్పలార్పుతూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతి 20 నిమిషాలకూ చూపును మళ్లించి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 క్షణాలపాటు చూడాలని నిపుణులు అంటున్నారు. అలాగే కంప్యూటర్ స్క్రీన్ కంటికి కనీసం 20 అంగుళాల దూరంలో ఉండాలట. స్క్రీన్ పైభాగం కళ్లకి కాస్త దిగువన ఉండేలా అమర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications