క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై.. ఇలా చేస్తే తినకుండా వదిలిపెట్టలేరు
మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం ఎక్కువ ప్రోటీన్లు తీసుకోగలిగితే ఆహారంలో అది మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. మనం తినే ఆహారాలలో క్యాబేజీ, కోడి గుడ్డు ఫ్రై హై ప్రోటీన్ ఆహారంగా చెప్పవచ్చు. మరి ఈ క్యాబేజీ కోడి గుడ్డు ఫ్రై ని ఏవిధంగా తయారు చేయాలి. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
క్యాబేజీ కోడి గుడ్డు ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
క్యాబేజీ - రెండు కప్పులు సన్నగా తరిగినది
కోడిగుడ్లు- మూడు
ఉల్లిపాయ- 1 సన్నగా తరిగినది
పచ్చిమిర్చి- రెండు సన్నగా తరిగినవి
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
ఆవాలు- అర టీ స్పూను
జీలకర్ర- అర టీ స్పూను
కరివేపాకు- రెండు రెమ్మలు
ఉప్పు- ఒకటిన్నర స్పూన్
కారం- ఒక స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూను

తయారీ విధానం
క్యాబేజీ ఎగ్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. అందులోనే కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టాలి.
ఇలా క్యాబేజ్, ఎగ్ ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్
క్యాబేజీ మగ్గిన తర్వాత అందులో గుడ్లు పగలగొట్టి పోయాలి. గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని, అందులో కారప్పొడి వేయాలి. కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ధనియాల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు వేయించాలి. అంతే రుచికరమైన క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఈ కూరతో ఆరోగ్య ప్రయోజనాలు
ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ కూరతో మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మెదడు ఆరోగ్యానికి, హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications