చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
చియా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఫైబర్‌తో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే విత్తనం. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చియా విత్తనాల వినియోగం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అనేక మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చియా విత్తనాలన తీసుకుంటున్నారు. అయితే.. చియా విత్తనాల తో ఎన్ని రకాలుగా మేలు జరుగుతుందో.. అదే సమయంలో తీసుకోవాల్సిన పరిమితి గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చియా ఎంత తీసుకోవాలి... ఏ విధంగా తినాలో సూచనలు చేస్తున్నారు.
ఫైబర్‌తో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే చియాను విదేశీ విత్తనంగా పరిగణిస్తారు. ఈ విత్తనాలను సాల్వియా హిస్పానియా అనే మొక్క నుండి తీసుకుంటారు. ఫైబర్ తో పాటు ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాల కారణంగా ఈ విత్తనాలు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన చర్మానికి కూడా మేలు చేస్తాయి. వీటిని చాలా మంది రాత్రిపుట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. కానీ, వీటిని పాలలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చియా విత్తనాలను తినడానికి ముందు వాటిని 10-15 నిమిషాలు నానబెట్టాలి. వాటిని నానబెట్టిన తర్వాత తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చియా గింజలు తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి.

ఆరోగ్య పరంగా ప్రయోజనాలు
కాగా, మొదటిసారి చియా విత్తనాలను తింటుంటే తక్కువ పరిమాణంలో తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఒక రోజులో 1 నుండి 2 చెంచాల చియా గింజలు మాత్రమే తీసుకోవాలి. చియా విత్తనాలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా, హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఉపయోగపడతాయి. చియా గింజలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి. చియా విత్తనాలు డయాబెటిక్ రోగులకు ఒక వరం లాంటివి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇవి డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి.












Click it and Unblock the Notifications