Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విపరీతమైన కాళ్ళ వాపులా?

ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిందే. అయితే ప్రస్తుతం భారతదేశంలో, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. సీకేడీ (CKD) యొక్క సాధారణ లక్షణాల్లో ఒకటి కాళ్ల వాపు, అయితే చాలామంది దీన్ని సరిగా గుర్తించలేరు. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోయి ఈ పరిస్థితి వస్తుంది.

కాళ్ళ వాపులకు ఈ తీవ్ర అనారోగ్య సమస్య కారణం

కాళ్ల వాపును వైద్య భాషలో ఎడిమా అంటారు. శరీర కణజాలాల్లో ఎక్కువ ద్రవం చేరినప్పుడు ఇది వస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులలో, మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు ద్రవాలను బయటకు పంపలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో, ద్రవాలు కాళ్లు, పాదాల్లో పేరుకుపోతాయి. ఫలితంగా కాళ్ల వాపులు, విపరీతమైన నొప్పులు వస్తాయి.

Chronic Kidney Disease And Leg Swelling A Growing Concern In India

కాళ్ల వాపుతో దీర్ఘ కాలిక కిడ్నీ సమస్య

మారిన జీవనశైలి, షుగర్ వ్యాధి (మధుమేహం), రక్తపోటు కేసులు పెరుగుతుండటం వల్ల కిడ్నీ సమస్యల బారిన పడుతున్న వారు ఎక్కువయ్యారు. చాలామందికి తమకు ఈ సమస్య ఉన్నట్లు తెలియదు, కాళ్లవాపు వంటి లక్షణాలు తీవ్రమయ్యేంత వరకు వారు గుర్తించలేరు. సమస్యను ముందుగా గుర్తించడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ సమస్యను నియంత్రించవచ్చు. సాధారణంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలను రాకుండా కాపాడుకోవాలంటే ముందు కాళ్ల వాపు పైన ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం.

కాళ్ళు వాపు వస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు

చాలామంది కాళ్లు వాస్తే పెద్దగా పట్టించుకోరు కానీ ఇది కిడ్నీ సమస్యకు కారణమవుతుందని తెలుసుకుని తక్షణం వైద్య పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే మూత్రపిండాల సమస్య తీవ్రమై తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యల వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియ చెప్పడం ద్వారానే, ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పడం ద్వారానే దీనిని కొంతమేర నియంత్రించవచ్చు.

కిడ్నీ వ్యాధులు తీవ్రం కాకుండా నియంత్రించాలంటే ఇలా చెయ్యండి

దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కాళ్ల వాపు వంటి లక్షణాలను తగ్గించడానికి ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. మందులు జాగ్రత్తగా వాడాలి. కాళ్ళ వాపులు తగ్గడానికి, మూత్రపిండాల సమస్య తీవ్రతరం కాకుండా ఉండడానికి ప్రణాళిక బద్ధంగా చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్ల వాపు లక్షణాలు మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన లక్షణాలుగా అర్థం చేసుకుంటే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే వారికి సరైన సమయంలో చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక కాళ్ల వాపులను ఎట్టి పరిస్థితులలోను నిర్లక్ష్యం చేయకూడదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+