మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం!
మద్యం అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ప్రస్తుతం మద్యం సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అతిగా మందు సేవించడంవల్ల శరీరంలోని ఏయే భాగాలపై ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడంతోపాటు శరీరంలో అతి ముఖ్యమైన అవయవమైన కాలేయం దెబ్బతింటుంది.
* ఏకాగ్రతను కోల్పోవడం, చేతులు, పాదాల్లో తిమ్మిరి అనిపించడంతోపాటు జ్ఞాపకశక్తి సమస్యలతోపాటు భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటి నరాల సమస్యలు వస్తాయి.
* ఒకేసారి మూడు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోవడంవల్ల తాత్కాలిక రక్తపోటు పెరుగుతుంది.
* ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఒకవైపు మద్యం సేవించడంవల్ల అనారోగ్యమని చెబుతున్నప్పటికీ రోజురోజుకు తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మద్యంపైనే ఆ రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉన్నవాటికితోడు కొత్తగా వైన్ షాప్స్, బార్లకు అనుమతులిస్తోంది. ఏడాదిన్నర క్రితం కొత్తగా 404 వైన్ షాపులకు అనుమతిచ్చింది. కొత్తగా మరో 159 బార్లకు అనుమతులు మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications