కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం.. పిక్స్ వైరల్ !!
తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన నటన, ప్రయోగాత్మక చిత్రాలు, సాహసోపేతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా కథలు, సాంకేతిక ప్రయోగాలతో తెలుగు సినీ రంగానికి కొత్త దారులు చూపించారు. అనంతరం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు
కాగా మహేష్ బాబుకు అన్న రమేష్ బాబుతో పాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. పద్మావతి, మంజుల, ప్రియదర్శిని.. వీరిలో పద్మావతిని గుల్లా జయదేవ్, మంజులను సంజయ్ స్వరూప్, ప్రియదర్శినిని ప్రముఖ నటుడు సుధీర్ బాబు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొరియన్ అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయడానికి సిద్దమవుతూ ఈరోజు నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత ఇన్ స్టా ద్వారా షేర్ చేయగా ఫుల్ వైరల్ గా మారాయి.

పద్మావతి - గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్దబ్బాయి అశోక్ ఇప్పటికే తెలుగులో హీరోగా రాణిస్తున్నాడు. చిన్న కోడుకు సిద్ధార్థ్ మాత్రం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కొన్నాళ్లుగా కొరియాకు చెందిన హాయిన్ / జిన్నీ అమ్మాయితో ఆయన ప్రేమలో ఉన్నారు. దీంతో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ జంట ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫోటోలలో నమ్రతతో పాటు మహేష్ అక్కలు, రమేష్ బాబు కూతురు భారతి కనిపిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.












Click it and Unblock the Notifications