Ind vs Eng: లార్డ్స్ లో దుమ్మురేపిన భారత్.. ! ఇంగ్లండ్ పై ప్రతీకారం..!
లార్డ్స్ లో తొలిసారి నిర్వహించిన మహిళల టెస్టులో ఇంగ్లండ్ (engalnd)ను భారత్ (india) చిత్తు చేసింది. హర్మన్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ను ఏకంగా 270 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా క్రికెట్ కు పుట్టిల్లుగా భావించే లార్డ్స్ లో చరిత్ర సృష్టించింది. తద్వారా లార్డ్స్‌లో మహిళల టెస్ట్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ ఒక చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది.
ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు తొలి ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 170 పరుగులకే కుప్పకూలింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో 115 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 7 వికెట్లకు 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇందులో యస్తిక భాటియా 113 పరుగులు చేసింది.

దీంతో భారత్ కు 456 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 457 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అమీ జోన్స్, సోఫీ ఎక్లెస్టోన్ ఇద్దరు మాత్రమే అర్ధసెంచరీలతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు తీయగా.. సయాలీ, క్రాంతి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కలిపి మొత్తం 7 వికెట్లు తీసిన క్రాంతి గౌడ్ కు విమెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications