రాగి లేదా స్టీల్ బాటిల్.. ఎందులో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది..?

ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం అధికంగా తీసుకునేది నీళ్లు. గంటకోసారి ఎన్నో కొన్ని నీళ్లు తాగుతూనే ఉంటాం. నీళ్లు తాగడం వల్ల చాలా రకాల సమస్యలు నుంచి బయటపడవచ్చు. నీళ్లు అధికంగా తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగవటమే కాక ఉత్సాహం పెరుగుతుంది. ఇక ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉంది. మురికి నీరు తాగునీటి వనరులలోకి ప్రవేశించడం ద్వారా అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే సురక్షితమైన, శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అయితే మనం నీరు తాగే బాటిల్ కూడా ముఖ్యమేనని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలో తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో రాగి, స్టీల్ బాటిళ్లను ఎక్కువగా వాడుతున్నారు. మరి ఈ రెండిట్లో ఏ బాటిల్ బెస్ట్? అని చూస్తే.. రాగి బాటిల్​లో సుమారు 6-8 గంటల పాటు నీటిని ఉంచడం వల్ల అందులోని పోషక గుణాలు వాటర్​లో కలిసిపోతాయని వైద్యులు అంటున్నారు. అలాగే రాగిలో అనేక యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయని అవి శరీరానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ఇది బాడీలోని బ్యాక్టీరియాను చంపి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

Copper vs Steel Bottles Why Drinking Water from Them Boosts Your Health

ఇక స్టెయిన్​లెస్ స్టీల్ బాటిల్స్ కూడా ​ఆరోగ్యానికి సురక్షితమని వైద్యులు వివరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే స్టీల్ బాటిల్ ఉత్తమం అని చెబుతున్నారు. ఇంకా తుప్పు పట్టకుండా చాలా రోజుల పాటు మన్నికగా ఉంటుందని అంటున్నారు. అలాగే స్టీల్ బాటిల్స్ చల్లటి, వేడి నీటిని వాటి ఉష్ణోగ్రతలు తగ్గకుండా చాలా సమయం ఉంచుతుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+