మళ్లీ కోరలు చాస్తున్న కరోనా!!
2020వ సంవత్సరంలో కొవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టించిందో అందరం చూశాం. దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని వణికించింది. అటువంటి కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. అందరూ కరోనా మాయమైపోయిందని, ఇక రాదని అనుకుంటున్నారు. కానీ మరో కొత్త వేరియంట్ దేశాలను కలవరపెడుతోంది.
జేఎన్ రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్ కు కారణమవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేయవని స్పష్టం చేస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందుతున్నారు. జేఎన్ 1 వైరస్ రకాన్ని మూడు నెలల క్రితం లగ్జెంబర్గ్ లో మొదటిసారి గుర్తించారు. ఈ వైరస్ అక్కడి నుంచి అమెరికా, ఫ్రాన్స్, ఐస్ ల్యాండ్ దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ ఎక్స్ బీబీ 1.5, హెచ్.వి.1 వంటి కొవిడ్ వైరస్ రకాలకు చెందినదే. అయినప్పటికీ పలు తేడాలున్నాయని చెబుతున్నారు.

ఎక్స్ బీబీ 1.5 రకం వైరస్ ముల్లు ప్రొటీన్ మీద 41 మార్పులు సంభవించి ఈ స్థితికి చేరుకుంది తేలింది. అందువల్లే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు దీన్ని నిలవరించలేవని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనినుంచి కాపాడుకోవాలంటు ఆధునికీకరించిన కొవిడ్ టీకాలు అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ ప్రకటించింది.
చైనాలో మొదటిసారి బయటపడిన కరోనా వైరస్ ను డాక్టర్ లీవెన్లియాంగ్ అనే వైద్యుడు మొదటిసారిగా గుర్తించారు. వుహాన్ లోని సముద్ర ఆహార ఉత్పత్తులు విక్రయించే మార్కెట్ లో బయటపడింది. ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్ ను లండన్ పంపించి పరిశోధనలు నిర్వహించారు. అనంతరం ఇది కరోనా వైరస్ గా తేలింది.












Click it and Unblock the Notifications