పెరుగు vs మజ్జిగ.. వేసవిలో ఎవరికి ఏది మంచిది..!!
పెరుగు...మజ్జిగ. ఈ రెండింటిలో ఏది మంచిది. వేసవిలో ఈ రెండింటి ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. రెండూ పాల ఉత్పత్తులే. అయితే, ఈ రెండింటి లో ఏది ఆరోగ్యానికి మంచింది. ఈ అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెండింటి లోనూ ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, వాటిని ఎంచుకునేటప్పుడు శరీర పరిస్థితి.. అవసరం కు అనుగుణంగా ఎంపిక చేసుకుంటాం. ఏ వయసు వారికైనా వీటి ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. పలువురు నిపుణులు ఈ రెండింటి వినియోగం పైన స్పష్టత ఇచ్చారు. వీటి వినియోగం ద్వారా ఎవరికి ఏది మంచిదో వివరించారు.
పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్స్. ఇవి రెండు కూడా ఎముకల బలం, జీర్ణక్రియ కు మేలు చేస్తాయి. రెండు ఉపయోగకరమే అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్ర వేర్వేరు ప్రయోజనాలు అందిస్తాయి. పెరుగు తినడం వల్ల ప్రోబయోటిక్స్ శరీరానికి అందుతాయి. పొట్టలో మంచి బాక్టీరియా ఉంటేనే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. శరీరం పోషకాలను గ్రహించే శక్తి పొందుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పెరుగులో ఉండే కాల్షియం ఎముకల బలాన్ని, దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. పిల్లలు, వృద్ధుల్లో ఎముకల సమస్యలు ఉంటే వారికి పెరుగు మేలు చేస్తుంది. ఇందులోని ప్రో బయోటిక్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి. మలబద్ధకం, అతిసార వంటి జీర్ణ సమస్యలను నియంత్రిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గించేలా చేస్తుంది. విటమిన్ B12, విటమిన్ D, రిబోఫ్లేవిన్, పొటాషియం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

వేసవిలో ఆరోగ్య ప్రయోజనాలు
అదే విధంగా మజ్జిగ ద్వారానూ అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోనూ ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటి ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి వాటిని దూరం చేస్తాయి. మజ్జిగలో కాల్షియం, విటమిన్ D ఉండటంతో ఎముకల బలాన్ని పెంచటంతో పాటుగా ఆస్టియోపొరోసిస్ ను నివారిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోటీన్లు, విట మిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మజ్జిగ తరచూ తీసుకోవటం ద్వారా వేడి నుంచి ఉపశమనం లభించటంతో పాటుగా డీహైడ్రేషన్ బారి నుంచి తప్పిస్తుంది. మజ్జిగ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు పెరుగు, మజ్జిగ... రెండింటితోనూ ప్రయోజనాలు ఉన్నాయి. రెండూ ఆరోగ్యానికి మంచి చేసేవే. కాగా, కొన్ని సందర్భాల్లో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్య పరంగా ఎక్కువ మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో మజ్జిగ శరీరంలో కోల్పోయే శక్తిని తిరిగి అందించటంలో సహకరిస్తుంది.
-
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications