కరివేపాకు టీ తాగితే మీ ఆరోగ్యంలో జరిగేవి అద్భుతాలే!

కరివేపాకు... ఆయుర్వేదంలో గొప్ప ఔషధ గుణాలున్న మొక్కగా కరివేపాకు గుర్తింపు ఉంది. మన భారతీయ వంటకాలలో కరివేపాకు కు ప్రముఖ స్థానం ఉంది. కరివేపాకులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వలన ఇవి మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. కరివేపాకును వంటల్లోనే కాకుండా పొడి రూపంలో కూడా తీసుకుంటున్నారు.

కరివేపాకు టీతో ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకు టీ ని తయారు చేసుకుని ప్రతిరోజు దానిని తాగి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రస్తుతం సమాజంలో చాలామందికి హెల్త్ మీద శ్రద్ధ పెరిగింది ఈ క్రమంలో ఏది తింటే మంచిది ఏది తాగితే మంచిది అని చెక్ చేసుకుంటున్న వారు లేకపోలేదు. ఇప్పటికే ఆహారాన్ని తినే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న వారు ఇప్పుడు తాగే వాటి విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నారు.

Curry leaves tea gives many health benefits including diabetes and weight reduction

కరివేపాకు టీతో జీర్ణవ్యవస్థకు ఆరోగ్యం
ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు తేయాకుతో తయారు చేసిన టీలు మాత్రమే కాదు అప్పుడప్పుడు కరివేపాకుతో తయారు చేసిన టీ ని కూడా ట్రై చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కరివేపాకుతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో మేలు చేస్తాయి.

ఇన్ఫెక్షన్ల బారి నుండి కరివేపాకుతో రక్షణ
దీనివలన గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకు టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. కరివేపాకు టీతో ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని దరి చేరవు. కరివేపాకు టీ మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను బయటకు పంపి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కరివేపాకు రక్షిస్తుంది.

కరివేపాకు టీ తో అధిక బరువుకు చెక్
కరివేపాకు టీ తాగినట్లయితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో కొవ్వును కరిగించడంలో కరివేపాకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. దీని వలన జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. కరివేపాకు టీ తాగడం వల్ల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి.

కరివేపాకు టీ ఒత్తిడి, ఆందోళనలకు చెక్
కరివేపాకు టీతో జుట్టు రాలకుండా ఉంటుంది. కరివేపాకు టీ ఒత్తిడి, ఆందోళనలకు చెక్ పెడుతుంది. ఇది ఒక రిలాక్సెంట్ గా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళల రుతుస్రావం వల్ల కలిగే నొప్పిని కరివేపాకు టీ తగ్గిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు టీని తాగితే మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. చాలావరకు రోగాల నుండి విముక్తి దొరుకుతుంది. ఉదయం పరగడుపున కరివేపాకు టీ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+