దీర్ఘాయుష్మాన్ - ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు..!!
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవంతో సమానం. పుట్టినప్పటి నుంచి ఆలనా పాలనా చూస్తూ మంచి చదువులు చెప్పించి సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చి దిద్దడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. మనకు అంతటి చక్కటి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం పిల్లలుగా మన బాధ్యత. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులకు సమయం కేటాయించలేకపోతున్నాం. ప్రపంచంలో పోటీ పెరిగిపోవడంతో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మర్చిపోతున్నాం. అది కావాలనే చేయడం లేదు కానీ, పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ్య రీత్యా మనం వారికి దూరంగా ఉంటున్నాం. తల్లిదండ్రులు మన సొంతూళ్లో ఉంటే... మనం విదేశాల్లో ఉంటున్నాం. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి..? జబ్బు చేస్తే వారిని ఎవరు చూసుకుంటారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్.
మన ఇంట్లో వారికి ఏదైనా జబ్బు చేస్తే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లే వారు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. కావాల్సిన వారు దూరంగా ఉండి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు దీర్ఘాయుష్మాన్ సంస్థ సిద్ధంగా ఉంటుంది. వారిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి వారికి కావాల్సిన చికిత్సను అందించి, పేషెంట్ తాలూకా మనుషులు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పేషెంట్‌కు వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపుతారు. అయితే అసలైన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. పేషెంట్ మందులు సమయానికి తీసుకుంటున్నాడా లేదా.. బీపీ, షుగర్ లెవెల్స్, గుండె పనితీరు, సరిగ్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. చాలా అంటే చాలా తక్కువ మంది ఇలాంటి కేర్ తీసుకుంటారు.

ఇక ఎక్కడో పల్లెటూర్లలో ఉండే వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిపై అంతగా శ్రద్ధ చూపరు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారి పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. పిల్లలు ఎక్కడో సిటీలో ఉంటూ వారిని కేవలం ఒక ఫోన్ కాల్‌తో మాత్రమే పరామర్శించడం జరుగుతుంది. అలాంటి వారికోసమే ఏపీలోని గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న దీర్ఘాషుష్మాన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ చక్కటి ఆలోచనతో ముందుకొచ్చింది.
ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు హోమ్ బేస్డ్ ఆరోగ్య సేవలను అందించడంతో పాటు, సకాలంలో అత్యవసర సహాయం చేసి వ్యాధిగ్రస్తుల ఆరోగ్య భద్రతను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తోంది దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్. ఏదైనా జబ్బు చేస్తే, అత్యవసర సమయాల్లో దీర్ఘాయుష్మాన్‌కు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వెంటనే ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్య వాహిని బైక్ అంబులెన్స్‌లు మీ గుమ్మం ముందు వచ్చి ఆగుతాయి. బైక్ అంబులెన్స్ అని అలా తేలిగ్గా తీసి పారేయకండి. అందులో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. సాధారణ అంబులెన్స్ వచ్చే వరకు రోగి ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ నుంచి ఇతర మెడిసిన్స్ వరకు అన్నీ ఆరోగ్య వాహిని బైక్ అంబులెన్స్‌లో ఉంటాయి.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డిశ్చార్జ్ అయ్యాక వారి ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో వైద్యులు అడిగి తెలుసుకోవడం చాలా తక్కువగా జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాపకమే ఉండదు.ఇక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పేషెంట్ హాస్పిటల్‌కు వెళ్లకపోవచ్చు. దీంతో రోగికి-వైద్యుడికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇక్కడే కీలక పాత్ర పోషిస్తోంది దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్. రోగికి-ఆస్పత్రికి వారధిగా వ్యవహరిస్తోంది.పేషంట్ ఇంటి గుమ్మం వద్దకే సేవలన్నిటినీ తీసుకొస్తోంది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఎలాంటి చికిత్స అందించి ఆరోగ్యాన్ని సమీక్షిస్తారో.. అంతకంటే మెరుగ్గా ఒక డాక్టరుతో కూడిన వైద్య బృందం ఇంటికే వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది. ఇక ప్రో రిథం అనే డివైజ్ ద్వారా ఎప్పటికప్పుడు పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని దూరంగా ఉన్న తమ వారికి చేరవేస్తారు. ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ సపోర్ట్, మెడికేషన్ థెరపీ మేనేజ్‌మెంట్, రోజూవారీ హెల్త్ చెకప్, ల్యాబ్‌లో చేయాల్సిన పరీక్షలు,వాక్సినేషన్‌తో పాటు మరిన్ని సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు.

మోబీ ల్యాబ్ కాన్సెప్ట్ ఏంటి..?
ఇక ఇంటికి వచ్చే వైద్య బృందం తమతో పాటు మోబి ల్యాబ్‌ను వెంట తీసుకొస్తుంది. మోబీ ల్యాబ్ అనేది పోర్టబుల్ ల్యాబ్ టెస్టింగ్ డివైజ్. ఒక 5నుంచి 6 కేజీల బరువుండే సూట్ కేసులో రోగికి పరీక్షలు నిర్వహించే పరికరాలు ఉంటాయి. ఉదాహరణకు బ్లడ్ టెస్టు చేయాలంటే రక్తం తీసి దాన్ని ల్యాబ్‌కు పంపి సాయంత్రం ఎప్పుడో రిపోర్ట్ వస్తుంది. అయితే మొబీ ల్యాబ్‌తో ఇంట్లో ఉన్న పేషెంట్‌కు బ్లడ్ తీసి పరీక్షించి అరగంటలో రిపోర్టు వస్తుంది.ఈ మొబీ ల్యాబ్ డివైజ్‌ను ఎయిమ్స్ న్యూఢిల్లీ ధృవీకరించింది. ఐఐటీ గౌహతీ విద్యార్థులు తయారు చేసిన ఈ డివైజ్ 99శాతం ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇస్తుంది. అరగంటలో ఒక పేషెంట్‌కు సంబంధించి 25 పరీక్షలు చేయొచ్చు.

దీర్ఘాయుష్మాన్ ద్వారా ఇంటివద్దకే ఆరోగ్య సేవలను అందించాలన్న ఇంతటి చక్కటి ఆలోచన ఈ సంస్థకు ఎక్కడి నుంచి పుట్టింది అనేది చూస్తే... ఈ సంస్థను ప్రారంభించింది రవి మద్దినేని. రవి మద్దినేని తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఆయన తండ్రి దగ్గర లేరు. ఇలా ఎవరికీ జరగకూడదని భావించి ఏదైనా చేయాలని చెప్పి.. తన తండ్రి విషాధ ఘటన నుంచి పుట్టిన ఆలోచనే దీర్ఘాయుష్మాన్. గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలను అందిస్తోంది. ఒక సామాజిక బాధ్యతతో అతి తక్కువ ఖర్చుకే ఇంటి గుమ్మం వద్దకే అన్ని ఆరోగ్య సేవలను తీసుకొస్తున్నామని చెప్పారు రవి మద్దినేని.












Click it and Unblock the Notifications