Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"మునక్కాయ పచ్చడి" ఇలా చేస్తే ఆరు నెలలు నిల్వ గ్యారంటీ..!

సాధారణంగా మునక్కాయలతో కూరలు, సాంబారు, పప్పు వంటి వంటకాలు చేస్తుంటాం. కానీ మునగకాయతో అద్భుతమైన నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మాస్‌ల తరబడి నిల్వ ఉండే ఈ పచ్చడి భోజనంలో రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఒకసారి ఈ పచ్చడిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది.

మునగలో విటమిన్ A, విటమిన్ Cలు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలానే కాల్షియం ఎముకల బలానికి సహాయపడుతుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పోషకాలు కూడా మునగ కాయల్లో ఉన్నాయి. డైజెషన్ మెరుగుపరచడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, కంటి చూపుని బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సంతానోత్పత్తి సమస్యలకు కూడా మునగకాయ బాగా పని చేస్తుందని అంటుంటారు. ముఖ్యంగా తరచూ జ్వరం, జలుబు వచ్చే వారికి మునగతో చేసిన వంటకాలు చాలా మేలు చేస్తాయి.

delicious-drum-sticks-chutney-recipe-in-telugu-and-health-benefits

పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు..

ఈ రుచికరమైన మునక్కాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:

  • 4 మునక్కాయలు

  • 50 గ్రాముల చింతపండు

  • 8 ఎండుమిర్చులు

  • 2 రెబ్బల కరివేపాకు

  • 10 వెల్లుల్లి రెబ్బలు

  • 2 స్పూన్ల మినపపప్పు

  • 2 స్పూన్ల శనగపప్పు

  • ½ టీస్పూన్ మెంతులు

  • 3 టీస్పూన్ల ఆవాలు

  • 1 టీస్పూన్ పసుపు

  • రుచికి సరిపడా ఉప్పు

  • 3 స్పూన్ల కారం

  • ¼ టీస్పూను ఇంగువ

  • 8 టీస్పూన్ల నూనె

    అదనంగా మీ రుచికి అనుగుణంగా కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి కూడా ఆప్షనల్‌గా ఉపయోగించవచ్చు.

    మునక్కాయలు పచ్చడి సిద్ధం చేసే విధానం..

    ముందుగా మునగ్గాకాయలను బాగా కడిగి, చెక్క తీసి నాలుగు సెం.మీ పొడవున ముక్కలుగా కోయాలి.

    ఆ తర్వాత శుభ్రమైన గుడ్డపై పరచి, తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచాలి. తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇది బాగా గమనించాలి.

    ఒక చిన్న కళాయిలో ఆవాలు, మెంతులు వేసి స్వల్పంగా వేయించాలి.

    అవి చల్లారిన తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడి పచ్చడికి ప్రత్యేక రుచిని ఇస్తుంది.

    చింతపండును నీటిలో కొద్దిసేపు నానబెట్టి, గుజ్జును వెలికి తీసి పక్కన పెట్టాలి. ( ఇది మునగకు తగినంత చేదు రుచిని సమతుల్యం చేస్తూ, పచ్చడికి తీపిపుల్లని ఫ్లేవర్‌ను ఇస్తుంది )

    కళాయిలో నూనె వేసి వేడెక్కాక మునక్కాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు స్వల్పంగా వేయించాలి. ( ఇవి కొద్దిగా కరకరలాడేలా అయిన తర్వాత వాటిని పక్కన పెట్టాలి )

    మిగిలిన నూనెలో మినపపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

    చివరగా పసుపు, ఇంగువ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో చింతపండు గుజ్జును వేసి.. చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.

    ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేయించిన మునక్కాయ ముక్కలు, కారం, ఉప్పు, ముందుగా చేసిన ఆవాలు –మెంతుల పొడి వేసి బాగా కలపాలి.

    ఆ తర్వాత తయారైన చింతపండు–మసాలా మిశ్రమాన్ని కూడా వేసి చేత్తో లేదా పెద్ద గరిటెతో నెమ్మదిగా కలపాలి. అన్ని మసాలాలు మునక్కాయ ముక్కలపై బాగా పట్టేలా కలపడం చాలా ముఖ్యం.

    నిల్వ విధానం & ముఖ్య సూచనలు..

    పచ్చడిని శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు లేదా స్టీల్ సీసాలో వేసి బిగిగా మూత పెట్టాలి. ఒక రోజు తర్వాత సీసాను తెరిచి చూస్తే నూనె పైకి తేలుతుంది. అప్పుడు మరోసారి బాగా కలపాలి.

    • నూనె తక్కువగా అనిపిస్తే వేడి చేసి చల్లారిన నూనెను కలపాలి.

    • తడి గరిటెలను ఎప్పుడూ పచ్చడిలో పెట్టకండి.

    • సూర్యకాంతి తగలకుండా, చల్లని ప్రదేశంలో సీసాను ఉంచాలి.

    • సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పచ్చడి 2 –4 నెలల వరకు సురక్షితంగా నిల్వ ఉంటుంది.

      ఈ పచ్చడిని రెండో రోజు నుంచి తినవచ్చు. వేడి తెల్లన్నంలో, నెయ్యి చిమ్ముకుని మునక్కాయ పచ్చడిని కలిపి తింటే రుచి భలే ఉంటుంది. ఇడ్లీ, దోసె, రొట్టెలతో కూడా బాగా నప్పుతుంది. సింపుల్ పదార్థాలతో, ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఈ నిల్వ పచ్చడి ప్రతి భోజనానికి రుచితో పాటు ఆరోగ్యాన్ని జోడిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+