చిల్లీ ఆయిల్..ట్రై చేయండి!!

చిల్లీ ఆయిల్. ఇప్పుడు భారతీయ వంటకాల్లో దీని ప్రాధాన్యత పెరుగుతోంది. విస్తృతంగా దీన్ని వినియోగిస్తోన్నారు. రోజువారీ ఆహారంలో దీన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితం కావడమే దీనికి ప్రధాన కారణం.

ఆలివ్, నువ్వులు లేదా ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, స్టార్ సోంపు వంటివి వేసి చిల్లీ ఆయిల్ ను తయారుచేస్తారు. ఇది వంటలకు రుచిని, ఘాటును ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఈ నూనెలో ఉండే కాప్సైసిన్ అనే పదార్థం జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది. కారం నూనెను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కారం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు

జీవక్రియను పెంచుతుంది..

చిల్లీ ఆయిల్.. జీవక్రియను పెంచుతుంది. ఇందులో ఉండే కాప్సైసిన్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కేలరీలు కరిగి, జీవక్రియ మెరుగుపడుతుంది. బరువును అదుపులో ఉంచడానికి, కొవ్వును కరిగించడానికి ఇది సహాయపడుతుంది.

వాపును తగ్గిస్తుంది..

చిల్లీ ఆయిల్ లో కాప్సైసిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, నొప్పిని తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి వంటి సమస్యలకు ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు. ఆలివ్ నూనె లేదా అవకాడో నూనెతో చేసిన కారం నూనె చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మితంగా చిల్లీ ఆయిల్ వినియోగించడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ నూనె లేదా అవకాడో నూనెతో చేసిన చిల్లీ నూనె.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది..

ఎండు మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆహారం జీర్ణవ్యవస్థ గుండా సాఫీగా వెళ్లడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మిరపకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చిల్లీ నూనెను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నొప్పిని తగ్గిస్తుంది: క్యాప్సైసిన్ నొప్పిని తగ్గించే గుణాలను కలిగి ఉంది. ఇది నొప్పి గ్రాహకాలను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్, నరాలు, కండరాల నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: కారం నూనె జీవక్రియను పెంచడం ద్వారా, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహిస్తుంది. క్యాప్సైసిన్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని ద్వారా కేలరీల వినియోగాన్ని తగ్గించవచ్చు.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..

ఛిల్లీ ఆయిల్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌ విడుదల అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఆందోళన, నిరాశ వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కారం నూనెను ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా తీసుకోవడం ముఖ్యం. అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న విషయాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+