హార్మోన్ల అసమతుల్యత నుండి కాపాడే ఆహారాలు, పనులు!!

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. హార్మోనల్ ఇన్ బ్యాలన్స్ కారణంగా చాలామంది మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే హార్మోన్లు సరిగా లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు దాని వల్ల శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి.

హార్మోన్ల సమతుల్యతకు ఆహారం ఇలా
హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కాకుండా హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం తీసుకోవాలి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం తింటే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన హార్మోన్లు కూడా అప్పుడు స్థిరంగా ఉంటాయి ముఖ్యంగా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ తో బాధపడుతున్న వారు చక్కెరతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

Do these things and eat these foods to get relief from hormonal imbalance

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ తగ్గాలంటే ఇలా చెయ్యాలి
విపరీతమైన ఒత్తిడి కూడా ఒక్కోసారి హార్మోనల్ ఇన్ బాలన్స్ కు కారణం అవుతుంది. ఒత్తిడి పెరిగేకొద్దీ హార్మోన్ల స్థిరత్వం దెబ్బతింటుంది. కాబట్టి ఎవరైతే ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారో వారు కచ్చితంగా మెడిటేషన్ చేస్తే మంచిది. ఒత్తిడి వల్ల వచ్చే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడంతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేస్తే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి.

హార్మోనల్ సమస్యలు రాకుండా ఇవి మానేయండి
నిద్రలేమి సమస్య కూడా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కు కారణం అవుతుంది. కాబట్టి కచ్చితంగా రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. చాలామంది కాఫీ, టీ ఎక్కువ తాగుతూ ఉంటారు. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాఫీలు, టీలు ఎక్కువ తాగడాన్ని మానేస్తే కూడా హార్మోన్ల అసమతుల్యత సమస్యలు రావు.

హార్మోన్ల సమస్యలకు ఈ సప్లిమెంట్స్ తీసుకోండి
ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కూడా హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. ప్రో బయోటిక్ రిచ్ ఆహారాలు తింటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. విటమిన్ బి, మెగ్నీషియం వంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండటం వల్ల కూడా హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ తగ్గుతుంది. కనుక హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారు పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత నుంచి బయటపడవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+