పాతకాలం నాటి 'దొండకాయ టమాటో రోటి పచ్చడి'.. ఇలా ఈజీగా చేసుకోండి..!
పాతకాలం నాటి పచ్చళ్లు ఎప్పుడూ రుచికరంగానే ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటి క్రేజీ పచ్చళ్లు చేస్తుంటారు. అందులోనూ రోటి పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ రోటి పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. నూనె, తాలింపు లేకుండా చాలా కమ్మగా ఉంటాయి. అందుకే పాతకాలం నాటి ప్రజలు ఇలాంటి పచ్చళ్లు తిని ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పాతకాలం నాటి 'దొండకాయ టమాటో రోటి పచ్చడి' ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!'దొండకాయ టమాటో రోటి పచ్చడి' తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
'దొండకాయ టమాటో రోటి పచ్చడి' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే దొండకాయలు తగినన్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 లేదా 5 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజులో చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా ఐదు, అలాగే కొన్ని పల్లీలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొన్ని తాలింపు గింజలు, కొద్దిగా ఎండు మిర్చి, తగినంత కొత్తిమీర, అలాగే తగినంత నూనె తీసుకోవాలి.
'దొండకాయ టమాటో రోటి పచ్చడి' తయారీ విధానం చూస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. రోటిలో ఒక్కొక్కటిగా వేసి దంచుకుంటూ ఆ మిశ్రమంలోనే కొద్దిగా చింతపండు, రుచిని బట్టి ఉప్పు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి రోటిలో మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. నూనే వేసి పోప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పోప్ ను పచ్చడిలో వేస్తే సరి.. సూపర్ టేస్టీ దొండకాయ టమాటా రోటీ పచ్చడి రెడీ అయినట్టే.. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications