వర్షాకాలంలో చర్మ సమస్యల విషయంలో నిర్లక్ష్యం వద్దు!
వర్షాకాలంలో చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు రావడమే కాకుండా అనేక చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. వర్షాకాలంలో ఎటువంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుండి మన చర్మాన్ని కాపాడుకోవడానికి మనం చేయవలసింది ఏమిటి? వంటి వివరాలను తెలుసుకుందాం. వర్షాకాలంలో తేమ పెరగడం వల్ల, ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల, కలుషితమైన వర్షపు నీళ్ల వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
వర్షాకాలంలో చర్మ సమస్యలు
ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దద్దుర్లు, చర్మం జిడ్డుగా మారడం లేదా పొడిబారడం అంటే అనేక సమస్యలు సాధారణంగా వస్తాయి. వర్షాకాలంలో వాతావరణంలో ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల సులభంగా వ్యాప్తి చెందుతాయి. చర్మం ఎర్రగా మారడం, చర్మంపై దద్దుర్లు రావడం, దురద పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు అధిక తేమ వల్ల చెమట వల్ల చర్మం పైన మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి వస్తాయి.

చర్మ సంరక్షణకు కచ్చితంగా జాగ్రత్తలు
ఇక చర్మంపై బ్యాక్టీరియా పెరగడం వల్ల దద్దుర్లు వంటివి వస్తాయి. ఇక వర్షాకాలంలో ఎగ్జిమా వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చు. అథ్లెట్స్ ఫుడ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వర్షాకాలం మన చర్మ సంరక్షణకు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం కలుషితమైన వర్షపు నీటిలో తడవకుండా కాపాడుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి , శుభ్రంగా తుడుచుకొని పొడిగా ఉంచుకోవాలి.
ఇలా చేస్తే చర్మ సంరక్షణ నుండి రక్షణ
వర్షం వల్ల తడిసి వచ్చినట్లయితే వెంటనే తడిసిన దుస్తులను మార్చుకోవాలి. వర్షాకాలంలో చర్మానికి సరిపోయే చర్మ సంరక్షణ ఉత్పత్తులను వినియోగించాలి. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చర్మ సమస్యలు తీవ్రంగా ఉంటే లేదా తగ్గకపోతే చర్మ వైద్యులను సంప్రదించాలి. వర్షాకాలంలో తేమ పెరగడం వల్ల వచ్చే చర్మ సమస్యలకు పసుపు మరియు వేప ప్రభావవంతమైన ఇంటి నివారణలుగా చెప్పబడ్డాయి.
పసుపుతో చర్మ సమస్యల నుండి రిలీఫ్
ఇవి రెండూ బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మ సమస్యలను ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. పసుపు దాని చికిత్స లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కర్కుమిన్‌ను కలిగి ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది. ప్రభావిత ప్రాంతాలలో పసుపు రాయడం చర్మం చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వేపతోనూ స్కిన్ కు బెనిఫిట్స్
వేప ఆకులు బ్యాక్టీరియా వ్యతిరేక సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని ముద్దగానూ లేదా స్నానానికి వేడినీటిలో ఉపయోగించవచ్చు. వేప చర్మాన్ని శుభ్రపరచడంలో మరియు సంక్రమణలను నివారించడంలో సహాయపడుతుంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications