ప్రతీరోజూ ఉదయం ఈ సహజ డీటాక్స్ పానీయాలతో ఆరోగ్యం, అందం!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలని ఎవరి కోరుకోరు చెప్పండి.. అటువంటి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం లేవగానే కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒకే రకమైన డ్రింక్స్ తాగడం కంటే, ఆరోగ్యకరమైన డ్రింక్స్ కొన్ని రోజులపాటు కొన్ని అలవాటు చేసుకుంటే, వాటిని మార్చి మార్చి తాగుతుంటే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయని కూడా చెబుతున్నారు.
ప్రతీరోజూ ఉదయమే ఈ డ్రింక్స్ తో లాభం
కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బాడీ డిటాక్సిఫై అవుతుందని, అందం, ఆరోగ్యం రెండూ వస్తాయని అటువంటి డ్రింక్స్ గురించి ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక ఉదయం తెల్లవారుజామున లేవగానే మనం తాగవలసిన కొన్ని డ్రింక్స్ లో ఒక మూడు డ్రింక్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం.

తులసితో సహజ డిటాక్స్
ఉదయం లేవగానే ఏదైనా సహజ సిద్ధమైన డ్రింక్ ను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం సహజ డిటాక్స్‌ను అందిస్తుంది. ఇవి రోజును తాజాదనంతో ప్రారంభించడానికి సహాయపడతాయి. తులసి, నిమ్మ, ఉసిరి వంటి భారతీయ మూలికలు డిటాక్సిఫైయింగ్ లక్షణాల కోసం ప్రసిద్ధి చెందాయి. తులసి, పవిత్ర తులసిగా కూడా పిలుస్తారు, రోగనిరోధక శక్తిని పెంచడం మరియు ఒత్తిడిని తగ్గించడం కోసం తులసి చాలా ప్రసిద్ధి చెందింది.
నిమ్మ మంచి డిటాక్స్ డ్రింక్
నిమ్మ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఈ మూడింటిని వివిధ రూపాలలో తీసుకోవచ్చు. తులసి ఆకులను టీగా మరిగించి, ఉదయం లేచిన వెంటనే తాగినట్లయితే అది మంచి డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది . నిమ్మను కూడా ఉదయం లేవగానే కాస్త గోరువెచ్చని నీటిలో రసాన్ని పిండుకొని, తేనెను కలుపుకొని తీసుకున్నట్లయితే, జీర్ణశక్తికి సహాయపడుతుంది. నిమ్మ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఉసిరి రసాన్ని తీసుకున్నా ఫుల్ బెనిఫిట్స్
ఇక ఉసిరిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలతో ఉసిరి కూడా మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి ఎంతో బాగా దోహదం చేస్తుంది. రోజువారి జీవితంలో ఈ మూడు డ్రింక్స్ ను ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అయితే ఏ డ్రింక్ ని తీసుకున్నప్పటికీ ఒక క్రమ పద్ధతిలో తీసుకోవలసిన అవసరం ఉంది.
-
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications