పరగడుపునే అల్లం రసాన్ని తాగండి- డయాబెటిస్, హైబీపీకి చెక్..!!
అల్లం ప్రతీ ఇంటా ఉంటుంది. ఆహార పదార్ధాల్లో ఎక్కువగా వినియోగిస్తాం. అల్లం రుచి.. వాసన మాత్రమే కాదు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం అల్లంకు ఎంతగానో ప్రాము ఖ్యత ఉంది. పలు రకాల ఔషధాల తయారీకి కూడా అల్లాన్ని ఉపయోగిస్తుంటారు. రోజూ ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ అల్లం రసం సేవిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే అనేక సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణ వ్యవస్థ మొదలు రక్తపోటు నియంత్రణ వరకు అల్లం మేలు చేస్తుందని చెబుతున్నారు.
అల్లంలో ఉన్న ఔషధ గుణాలు పలు రకాల అరోగ్య సమస్యల పరిష్కారినికి మేలు చేస్తాయి. అల్లం రసం తాగడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. అల్లంలో జింజరాల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారం సులభంగా కదిలేలా చేస్తాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెటబాలిజం కూడా పెరుగుతుంది. అధిక బరువు తగ్గటానికి అ్లం దోహదం చేస్తుంది. అల్లం రసాన్ని పరగడుపునే సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.

ఆర్దరైటిస్ సమస్యలు ఉన్నవారికి అల్లం రసంతో ఉపశమనం ఉంటుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూ లించి శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇన్‌ఫెక్షన్లు, రోగాలకు శరీరం వ్యతిరేకం గా పోరాడుతుంది. అల్లం రసం సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయో గించుకుంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయ. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇక, అల్లం రసం తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలోని అంతర్గత వాపులు తగ్గిపోతాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇలా అల్లం రసం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు












Click it and Unblock the Notifications