కొందరికి చేపలు తినటం ఆరోగ్యం కాదు.. జాగ్రత్త!
చేపలు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారంగా పరిగణించబడతాయి. చేపలలో విటమిన్ D, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. అయినా కొందరికి చేపలు తినటం మంచిది కాదు అందుకు చాలా కారణాలు ఉన్నాయి. చాలా మందికి చేపల కారణంగా అలెర్జీలు వస్తాయి. అలెర్జీల సమస్యలు ఉన్నవారు చేపలను తినకుండా ఉంటేనే మంచిది.
చేపలు తింటే కొందరికి అనారోగ్యం
చేపలు తిన్న వెంటనే తలనొప్పి, వాంతులు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అప్పటికప్పుడు షాక్ వంటి కొన్ని లక్షణాలు కనిపించొచ్చు. కొన్ని చేపలు కలుషిత నీటిలో పెరిగినవై ఉండవచ్చు. ఇవి టాక్సిన్స్‌ను కలిగి ఉండవచ్చు. ఇటువంటి చేపలు కూడా ప్రమాదకరం. ఇవి ఆరోగ్యానికి హానికరం.

ఈ చేపలతో కొందరికి హాని
హై మెర్క్యూరీ స్థాయిలు ఉన్న చేపలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ట్యూనా, షార్క్, స్వోర్డ్‌ఫిష్ వంటి పెద్ద చేపలలో పాదరసం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలు, పిల్లలు లేదా నాడీ వ్యవస్థ సమస్యలు ఉన్నవారికి హానికరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా గర్భవతులూ, చిన్న పిల్లలూ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోగాలున్న వారికి చేపలు తింటే ప్రమాదం
కొన్ని రోగాలున్నవారికి చేపలు ప్రమాదకరం అని చెప్తారు. గౌట్, కిడ్నీ సమస్యలు ఉన్న వారికి చేపలు ప్రమాదకరం. చేపల్లో ప్యూరిన్లు ఎక్కువగా ఉండడం వల్ల గౌట్ రోగులకు ప్రమాదం. కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి కూడా ఎక్కువ ప్రోటీన్‌ను ప్రాసెస్ చేయడం కష్టంగా మారవచ్చు. ప్రాసెసింగ్ సరిగ్గా చెయ్యని లేదా కాలుష్యం కారణంగా ఉన్నా చేపలు మనకు హాని చేస్తాయి.
కొన్ని రకాల చేపలతో అనారోగ్యాలు .. జాగ్రత్త
కొన్నిసార్లు చేపలు పరిశుభ్రంగా కాకుండా నిల్వ చేస్తే, లేదా కాలుష్యమైన నీటిలో పెరిగితే, వాటి ద్వారా హానికరమైన బ్యాక్టీరియా లేదా టాక్సిన్లు మన శరీరానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి చేపలలోని అధిక ప్రోటీన్ లేదా కొవ్వు కొందరి జీర్ణవ్యవస్థకు సరిపడకపోవచ్చు, ముఖ్యంగా కాలేయం లేదా గట్ సమస్యలు ఉన్నవారికి చేపలు ఇబ్బంది కలిగించవచ్చు. కనుక చేపలు తిన్న తర్వాత ఎవరికైనా ప్రతికూల లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవటం మంచిది.












Click it and Unblock the Notifications