నిలబడి తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం
ప్రస్తుత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి వస్తుండటంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవన్నీ అనారోగ్యాన్ని కల్పించే అలవాట్లే. కొంతమందికి తినడానికి సమయం ఉండదు. హడావిడిగా ఏదోఒకటి తినేస్తుంటారు. ఈరోజుల్లో బయట తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సమయానికి తినకపోవడంవల్ల అనారోగ్యమే.
ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై ఏదో దొరికిందిలే.. తినేశామా? అన్నట్లుగా తింటున్నారు. కార్యాలయాల్లో లేదంటే హోటల్స్ లో ప్రతిరోజు ఆహారం తినేవారిని చూస్తూనే ఉన్నాం. దాదాపుగా అందరూ నిలబడి తింటున్నారు. పెళ్లిళ్లైనా, ఫంక్షన్స్ అయినా.. ఎక్కడైనా అందరూ నిలబడే తింటున్నారు. ఒకటి రెండుసార్లైతే పర్వాలేదుకానీ ప్రతిసారి.. అదేపనిగా నిలబడి తినడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు.

* నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువ తీసుకుంటారు.
* నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి. తిన్నది జీర్ణం కాదు.
* కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
* గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీనివల్ అల్సర్లు వస్తాయి.
* ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అంతేకాదు.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.












Click it and Unblock the Notifications