Green Peas: పచ్చి బఠానీలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!
చాలా మంది బఠానీ తింటుంటారు. ముఖ్యం చాట్ ఫుడ్ బఠానీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే బిర్యానీ రైస్ లో కూడా బఠానీ వాడుతారు. ఈ బఠానీతో ఎన్ను ఉపయోగాలు ఉన్నాయట. ఇవి జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడతాయి.
పచ్చి బఠానీలు గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి .రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి బఠానీలు చాలా మంచివట.

బరువు
పచ్చి బఠానీలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. పచ్చి బఠానీలలో ఐరన్, జింక్, మాంగనీస్ , రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి బఠానీలు గుండె, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అల్జీమర్స్
బఠానీ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. పచ్చి బఠానీలను గ్రైండ్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పచ్చి బఠానీలలో పాలీమియోథల్లనమైడ్ ఉంటుంది. అల్జీమర్స్‌తో పోరాడటానికి పాలీమియోథైలీనామైడ్ ఉపయోగపడుతుందని పలు అధ్యాయనాల్లో తేలింది.

చర్మం
బఠానీల్లో ఉండే విటమిన్-ఎ,ఇ చర్మానికి చాలా మేలు చేస్తాయి. చలిలో పెదవులు, మడమలు పగిలిపోవడాన్ని తగ్గిస్తాయి. పచ్చి బఠానీలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చురుగ్గా పని చెస్తుంది. అయితే పచ్చి పఠానీ ఎక్కువగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

యాంటీ న్యూట్రియెంట్స్
పచ్చి బఠానీలు పోషకాలతో నిండి ఉంటాయి. కానీ వాటిలో కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇనుము, కాల్షియం, జింక్ శోషణను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి బఠానీలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుందట.పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైటిక్ వంటి కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి వాయువు, గాలితో ఉబ్బరంకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications