కోడిగుడ్లతో కలిపి తినకూడదని ఫుడ్ ఐటమ్స్..: మోర్ డేంజర్
మన రోజువారీ ఆహారంలో ఓ భాగం.. కోడిగుడ్లు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్, విటమిన్ డీ, అమైనో ఆమ్లాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు అద్భుతమైన వనరు. రోజూ కోడిగుడ్లను తీసుకోవడం వల్ల కండరాల బలహీనత తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆహార పదార్థాలను మాత్రం కోడిగుడ్లతో కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తోన్నారు. వీటివల్ల చర్మ సంబంధిత ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి.

సోయా మిల్క్..
కోడిగుడ్లతో కలిపి సోయా మిల్క్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్ అందకపోవచ్చు. గుడ్లు, సోయా రెండింటిలోనూ అధిక మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. ఒక పరిమితికి మించి ప్రొటీన్ ఉండటం మంచిది కాదు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కు దారి తీయవచ్చు. అంటే శరీరం రెండు ఆహారాల నుండి మోతాదుకు మించిన పోషకాలను పొందలేకపోవచ్చు. గుడ్లు, సోయా పాలను వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిది.
టీ..
చాలా మంది అల్పాహారంతో పాటు గుడ్లు, టీ తాగుతారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ప్రొటీన్ స్థాయిని నిరోధిస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం- గుడ్లతో పాటు టీ తాగడం వల్ల ప్రొటీన్ పరిమాణం దాదాపు 17 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుడ్లు, టీ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవడం మంచిది. ఈ రెండింటి మధ్య కనీసం అరగంట నుంచి గంట వ్యవధి ఉండాలి.
చక్కెర..
గుడ్లతో పాటు చక్కెరను తీసుకోవడాన్ని కూడా నివారించాలి. గుడ్లు ప్రొటీన్, అమైనో ఆమ్లాలకు అద్భుతమైన వనరు అయినప్పటికీ, చక్కెర గుడ్లలోని అమైనో ఆమ్లాలతో కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో హానికరమైన సమ్మేళనాలను ఏర్పరచవచ్చు. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. సమతుల్య, సురక్షితమైన జీర్ణ ప్రక్రియ కోసం కోడిగుడ్లతో పాటు తీపి ఆహారాలు లేదా పానీయాలను నివారించాలి.
అరటిపండ్లు..
గుడ్లు, అరటిపండ్లు పోషకాలు అధికం.ఈ రెండు ఆహారాలు సాంద్రతతో కూడుకుని ఉన్నవి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.. ఈ రెండు ఆహార పదార్థాలు కూడా. అలాంటిది- వీటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మరింత నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బరంగా మారుతుంది..బరువుగా అనిపిస్తుంది. కోడిగుడ్లు, అరటిపండ్లను వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిది.
మాంసం..
మటన్, చికెన్.. అన్నింటికంటే ముఖ్యంగా చేపలతో కలిపి కోడిగుడ్లను తీసుకోవడాన్ని నివారించాలి. గుడ్లు, మాంసం.. ప్రొటీన్, కొవ్వుకు అద్భుతమైన వనరులు. ఒకేసారి వీటిని తీసుకుంటే జీర్ణం కావడం చాలా కష్టం. దీనికి చాలా సమయం పడుతుంది. జీర్ణవ్యవస్థపై అధిక భారం పడటం వల్ల భోజనం తర్వాత అసౌకర్యం, అలసట, లేజీ నెస్ ఏర్పడవచ్చు. ఇది తాత్కాలికంగా జీవక్రియను మందగింపజేస్తుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications