5 నిమిషాల్లో అద్దిరిపోయే 'ఫ్రైడ్ రైస్'.. ఈజీగా ఇలా చేసుకోండి..!
ఈ రోజుల్లో చాలామంది ఈజీ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ఏదైనా ఫాస్ట్ గా చేసుకునే విధానానికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు వంట చేసుకునే సమయం ఉండదు. అలాంటి వారి కోసం కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఉంది. పూదీనా కాంబోలో ఈ రైస్ ను చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఎక్కువ పదార్థాలు లేకుండా ఈ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు.
మరి అద్దిరిపోయే ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. రెండు కప్పులు అన్నం, 50 గ్రాముల పనీర్, కొద్దిగా అల్లం ముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ఒకటి, మూడు పచ్చిమిర్చి, పసుపు కొద్దిగా, దాల్చిన చెక్క, కొత్తిమీర తరుగు, లవంగాలు రెండు, ఒక బిర్యానీ ఆకు, మిరియాల పొడి, ధనియాల పొడి కొద్దిగా, పూదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్ ల నూనె, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి.
ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర రోటిలో వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఆ ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చి ముక్కలను దోరగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు అందులోనే పసుపు, అల్లం ముద్ద, ధనియాల పొడి, మిరియాల పొడిని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసిన పనీర్ ముక్కలను కలుపుకోవాలి. ఆ తర్వాత నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నాక ఇందులో అన్నం వేయాలి. అన్నీ కలిసేలా మిక్సింగ్ చేసుకోవాలి. అలా సిమ్ లో పెట్టి నిమ్మరసం కలిపి దింపేస్తే సరిపోతుంది. సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ..












Click it and Unblock the Notifications