వర్షాకాలంలో ఈ పండ్లు అసలే తినొద్దు.. తింటే జరిగేదిదే!

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. ఇక ఏ సీజన్ ను బట్టి ఆ సీజన్లో తినవలసిన పండ్లు తినాలని చెబుతారు. వర్షాకాలంలో కూడా కొన్ని రకాల పండ్లను తినడం మంచిదే కానీ కొన్ని రకాల పండ్లతో అనేక అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని, తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో తినకూడని పండ్లు ఏంటి? ఎటువంటి పండ్లు తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది తెలుసుకుందాం.

వర్షాకాలం ఈ పండ్లు తినొద్దు

వర్షాకాలంలో మామిడి పండ్లు తినకూడదు. వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లు తినడం శరీరానికి హాని చేస్తుంది. అనేక అలర్జీలకు కారణమవుతుంది. వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లు అంత ఆరోగ్యకరమైనవి కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో అరటి పండ్లు తింటే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది వర్షాకాలంలో అరటిపండ్లు తింటే నోటి ఎలర్జీ సిండ్రోమ్ ను ఎదుర్కొంటారు.

Fruits That Cause Allergies During The Rainy Season

ఈ పండ్లు ఈ సీజన్ లో తింటే అలెర్జీలు

గొంతులో నోట్లో అలర్జీ మరియు వాపు వంటి లక్షణాలను చూస్తారు. కాబట్టి అరటి పండ్లను తినకుండా ఉంటే మంచిది. వర్షాకాలంలో అనాస పండ్లను తినడం మంచిది కాదు. అనాస పండ్లలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది కొందరు వ్యక్తుల్లో అలెర్జీ ప్రతిచర్యలను కలిగించవచ్చు. లక్షణాలలో చర్మ దద్దుర్లు లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు. కనుక అనాస పండ్లు తినకుండా ఉండాలి.

వీటిని ఈ సీజన్ లో పొరబాటున కూడా తినొద్దు

వర్షాకాలంలో చెర్రీస్ తినకుండా ఉంటే మంచిది. చెర్రీస్ నోట్లో అలర్జీకి కారణమవుతాయి. కనుక ఈ సీజన్లో చెర్రీస్ కు దూరంగా ఉండాలి. వర్షాకాలం స్ట్రాబెర్రీలు తినకుండా ఉంటే మంచిది. ఈ సీజన్లో స్ట్రాబెర్రీలు తింటే కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురద వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారు. కనుక వర్షాకాలంలో స్ట్రాబెర్రీలు తినకూడదు.

ఇవి తింటే వర్షాకాలంలో అనారోగ్యం

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ నిదానంగా పని చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కర్బూజ పండ్లు తినకూడదు. కర్బుజా తింటే జీర్ణ సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి .వర్షాకాలంలో ద్రాక్ష పండ్లు తినకూడదు. ద్రాక్ష పళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే కారకాలు ఈ సీజన్ లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో ద్రాక్ష పండ్లను తినకుండా ఉంటేనే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+