గ్రీన్ టీ Vs బ్లాక్ టీ- వేసవిలో ఎవరికి ఏది మంచిది..!!

ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిది. అదే విధంగా బ్లాక్ టీ తోనూ ఆరోగ్య ప్రయోజనాలు. మరి..ఈ రెండింటి లో ఏది నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పలువురిలో ఈ సందేహం నెలకొంది. గ్రీన్ టీ, బ్లాక్ టీని వేర్వేరుగా త‌యారు చేస్తారు. వీటి త‌యారీకి ఉప‌యోగించే టీ ఆకులు కూడా వేరేగా ఉంటాయి. అయితే కొంద‌రు గ్రీన్ టీని తాగ‌మ‌ని చెబితే, కొంద‌రు బ్లాక్ టీ మంచిద‌ని అంటారు. ఏ టీలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి..ఏ టీని రోజూ తాగితే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వచ్చు..అనేది చాలా మందికి ఉన్న అనుమానం. వీటికి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటికి సంబంధించి తేయాకులను కూడా Camellia sinensis అనే మొక్క నుంచి సేక‌రిస్తారు. కానీ ఈ ఆకుల‌ను వేర్వేరుగా ప్రాసెస్ చేస్తారు. దీంతో గ్రీన్ టీ, సాధార‌ణ టీ రెడీ అవుతాయి. గ్రీన్ టీ గా త‌యారు అయ్యే ఆకులు కాస్త త‌క్కువ ప్రాసెస్ చేయ‌బ‌డ‌తాయి. సాధార‌ణ టీ గా మారే ఆకుల‌ను ఎక్కువ‌గా ప్రాసెస్ చేస్తారు. వీటిని పొడిగా మారుస్తారు. అనంత‌రం దీంతో బ్లాక్ టీ త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు టీలు మ‌న‌కు దాదాపుగా ఒకేలాంటి లాభాల‌ను అందిస్తాయి. ఈ రెండింటిలో పోష‌కాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ రెండు టీల‌లోనూ యాంటీ ఆక్సిడెం ట్లు ఉంటాయి. గ్రీన్ టీని సేవించ‌డం వ‌ల్ల కెఫీన్ చాలా త‌క్కువ‌గా ల‌భిస్తుంది. కానీ బ్లాక్ టీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ కాస్త చేదుగా, వ‌గ‌రుగా ఉంటే, బ్లాక్ టీ పులిసిన రుచిని క‌లిగి ఉంటుంది. గ్రీన్ టీని సేవించ‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి.

green-tea-vs-black-tea-compared-to-black-coffee-green-tea-has-lower-caffeine-levels-reducing-the

ఆరోగ్య పరంగా ప్రయోజనాలు.. పరిమితులు

ముఖ్యంగా గ్రీన్ టీని తాగితే ఈజీసీజీ అనే స‌మ్మేళ‌నం ల‌భిస్తుంది. ఇది చాలా శ‌క్తివంత‌ మైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. గ్రీన్ టీమ‌న శ‌రీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొల‌గించి వాపుల‌ను త‌గ్గిస్తుంది. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. దీని వ‌ల్ల బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌, కోల‌న్ వంటి క్యాన్స‌ర్లు రాకుండా నివారించ‌వ‌చ్చు. ఇక బ్లాక్ టీలో టీ పొడి ప్రాసెసింగ్‌కు గుర‌వుతుంది క‌నుక చాలా వ‌ర‌కు ఈజీసీజీ న‌శిస్తుంది. అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఈజీసీజీ లాంటి లాభాల‌నే అందిస్తాయి. కానీ చాలా త‌క్కువ శ‌క్తివంత‌మైన‌వి. క‌నుక క్యాన్స‌ర్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలో బ్లాక్ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో మెరుగ్గా ప‌నిచేస్తుంది. ఇక ఈ రెండు టీలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సుర‌క్షి తంగా ఉండ‌వ‌చ్చు. అయితే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారాలంటే మాత్రం గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. ఈ రెండు టీల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. ఉద‌యం బ్లాక్ టీని, సాయంత్రం గ్రీన్ టీని ఒక క‌ప్పు మోతాదు చొప్పున తాగుతుంటే ఎంతో మేలు జ‌రుగు తుంద‌ని స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+