యువతలో ఆందోళనకరంగా జుట్టు రాలే సమస్య.. అర్ధం చేసుకోవాల్సిన అంశాలివే!
యువతలో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారుతోంది. జీవనశైలి మార్పులు, ఒత్తిడి మరియు పర్యావరణ కాలుష్యం కారణంగా ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. విపరీతంగా జుట్టు రాలిపోవడంతో యువత జుట్టు విషయంలో న్యూనతా భావానికి గురవుతున్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి యువత బయటపడతారు? తెలుసుకుందాం.
యువతలో జుట్టు రాలడానికి కారణాలు
ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణం. యూత్ పై ఉండే ఒత్తిడి. చదువుకునే వారిలో చదువు విషయంలో ఒత్తిడి, ఉద్యోగం చేసే వారిలో ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుంది. యువతలో పెరుగుతున్న ఈ ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణమవుతుంది. కనుక యువత ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇలా చేస్తే కాస్త జుట్టు రాలడం తగ్గుతుంది.

ఆహారపు అలవాట్లు
యువతలో జుట్టు రాలడానికి మరొక ముఖ్యమైన కారణం వారి చెడు ఆహారపు అలవాట్లు. యువత మంచి పోషకాహారం తీసుకోవడం లేదు. బయట జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కు అలవాటు పడి శరీరానికి కావలసిన పోషకాలు విషయం మరిచిపోతున్నారు. శరీరానికి పోషకాలు సరిగా అందకపోతే జుట్టు రాలిపోతుంది. కనుక యువత జుట్టురాలే సమస్య నుండి బయటపడాలంటే పోషకాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిఆహారం తీసుకుంటే జుట్టురాలే సమస్య కాస్త తగ్గుతుంది.
ఈ విషయాల్లో యువత జాగ్రత్తగా ఉండాలి
ఇక జుట్టు రాలడానికి మరొక ముఖ్యమైన సమస్య వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. దుమ్ము ధూళి వంటి కారకాలతో జుట్టు బలహీన పడుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. ఇదే సమయంలో తలస్నానం చేయడానికి ఉపయోగించే షాంపూలు, హెయిర్ డై వేసుకోవడానికి ఉపయోగించే కలర్స్ కూడా జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. బయటకు వెళ్లినప్పుడు జుట్టును పొల్యూషన్ నుంచి కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఇంట్లో ఉపయోగించే రసాయన షాంపూలు, హెయిర్ కలర్స్ విషయంలో జాగ్రత్త వహించాలి . యువత ఈ విషయాలను అర్థం చేసుకుంటే జుట్టు రాలే సమస్యకు కొంత పరిష్కారం లభించినట్టే.












Click it and Unblock the Notifications