Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమ్మర్ హీట్ కు ది బెస్ట్ విరుగుడు ఈ డ్రింక్

నిమ్మ.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే అద్భుత ఔషధం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. మన వంటకాల్లో ఇది నిత్యావసరం కూడా. పులిహోర వంటి వంటకాల్లో నిమ్మ లేనిదే పని జరగదు. రుచి కోసం ఉపయోగిస్తారు. దీనికి ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి.

రోజువారీ జీవితంలో ..

విటమిన్ సీ, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే నిమ్మరసం, తక్కువ కేలరీలు, లో షుగర్ కంటెంట్ ఉన్న పానీయం. దైనందిన జీవితంలో నిమ్మరసాన్ని చేర్చుకోవడం వల్ల ఈ ఏడు అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. డీహైడ్రేషన్ అనేది అన్ని వయసుల వారిలో సాధారణ సమస్య. మహిళలు రోజుకు సుమారు 2.7 లీటర్ల నీటిని, పురుషులు 3.7 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ జీవితంలో నిమ్మరసం/నీంబూపానీ కలుపుకొంటే అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Health advantages of daily lemon water including hydration vitamin C intake digestion support

ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల..

విటమిన్ సీ కి మంచి వనరు నిమ్మ. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తూ, రోగనిరోధక వ్యవస్థను కాపాడుతుంది. సగం నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకోవడం ద్వారా రోజువారీ విటమిన్ సీ అవసరాన్ని సులభంగా తీర్చుకోవచ్చు. ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి కూడా. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలిని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది ఆహారం, తీపి పదార్థాల పట్ల కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడా వంటి పానీయాలకు బదులుగా రోజువారీ నిమ్మరసం తీసుకోవడం మంచిది. ఇది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సీ చర్మం ముడతలు పడకుండా, పొడిబారకుండా, వృద్ధాప్య ఛాయలు, సూర్యరశ్మి నుండి కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

శక్తివంతమైన ఆల్కలీన్ డ్రింక్..

నిమ్మకాయ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ఆహారంలో క్రమం తప్పకుండా నిమ్మరసాన్ని చేర్చడం ద్వారా తాజాగా, ఎనర్జిటిక్ గా ఉండొచ్చు. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం తీసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. నిమ్మకాయ శక్తివంతమైన ఆల్కలీన్ డ్రింక్. ఇది కడుపులోని pH స్థాయిలను సమతుల్యం చేసి, గుండెల్లో మంటను నివారిస్తుంది.

నోటి దుర్వాసన తగ్గడానికీ..

నోటి దుర్వాసన గురించి ఆందోళన చెందుతుంటే, నిమ్మరసం ప్రయత్నించండి. భోజనం తర్వాత లేదా ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం మంచిది. ఇది నోరు పొడిబారకుండా నిరోధిస్తుంది. లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలం లేకపోవడం వల్లనే బ్యాక్టీరియా వల్ల నోటి దుర్వాసన వస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది కాల్షియం రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. సిట్రేట్ చిన్న రాళ్లను విడగొట్టి, అవి సులభంగా శరీరం నుండి బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+