Cinnamon Benefits: మీరు ఆ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే దాల్చిన చెక్క వాడండి..!
చలికాలం రాగానే పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఈ చలి వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అయితే ప్రతి దానికి మెడిసిన్ వాడకుండా వాటింటి చిట్కాలు వాడడం మేలు. ఇలా జలుబు, దగ్గు దగ్గడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట.

డయాబెటిస్
ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం.. 20 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసున్న 537 మిలియన్ల మంది షుగర్ తో బాధపడుతున్నారట. శరీరంలో చక్కరస్థాయి అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్కు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క వల్ల మహిళల్లో రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుందట.

యాంటీ- ఇన్‌ఫ్లామేటరీ
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ- ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మంట, వాపులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దాల్చిన చెక్క నోటి దుర్వాసనను పోగొట్టుతుంది. అదే విధంగా దగ్గు, పంటినొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు తదితర సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుట్టే కాస్త ఉపశమనం లభిస్తుంది.

దాల్చిన చెక్క రసం
ఫుడ్‌పాయిజన్ అయిన సందర్భాల్లో దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందట. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాల్చిన చెక్క సువాసన, రంగుకు కారణమైన సినామాల్డెహైడ్ అనే రసాయనం హైపోగ్లైసెమిక్ ఏజెంట్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పీసీఓఎస్
పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళలకు దాల్చినచెక్కను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందట. దీని కోసం వారు ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి దానిని బాగా మరిగించి తీసుకుంటే ఈ సమస్య కాస్త తగ్గుముఖం పడుతుంది. రుచి కోసం నిమ్మకాయ తేదా కొంచెం తేనెను కలుపుకొవచ్చు.












Click it and Unblock the Notifications