లాయర్ గా మారిన మమత - బీజేపీ పై తానే స్వయంగా వాదనలు..!!
దీదీ కొత్త డ్యూటీ మొదలు పెట్టారు. ఎన్నికల్లో ఓడిన తరువాత ఇప్పుడు న్యాయస్థానంలో బీజేపీ పై పోరాటం చేస్తున్నారు. ఇందుకు తానే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. మమతా బెనర్జీ లాయర్ దుస్తుల్లో కోల్‌కతా హైకోర్టుకు హాజరయ్యారు. జడ్జికి స్వయంగా వాదనలు వినిపించారు. న్యాయం కోసం తన పోరాటం సాగుతుందని మమత స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగానూ ఓడిపోయిన మమతా.. ఇప్పుడు కోర్టులో బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న వాదనల్లో ఏ మేర విజయం సాధిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బెంగాల్ మాజీ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా లాయర్ గా మారారు. లాయర్ దుస్తుల్లో కోల్ కతా హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చేసిన హింస, విధ్వంసాలపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దీదీ న్యాయవాదిగా కోర్టుకు హాజరై జడ్జికి స్వయంగా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పని చేసిన మమతా.. ఎన్నికల్లో ఓడిపోయి పది రోజులు పూర్తి కాలేదు. అయినా.. వెంటనే లాయర్ గా కోర్టులో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదనలు వినిపిస్తున్నారు. మమత తాజాగా కోర్టు లో లాయర్ గా కొత్త పాత్ర పైన రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది.

కోర్టులో తానే స్వయంగ ా వాదనలు
న్యాయవాద విద్య పూర్తి చేసిన మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగడం ఇదే మొదటిసారి. తన వాదనలతో కోర్టులో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల అనంతర హింసపై సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో మమత అనేక సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. శాంతిభద్రతలను కాపాడటమే తన ధ్యేయమని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె బలంగా వాదించారు. కేవలం తన పార్టీ కార్యకర్తల కోసమే కాకుండా బాధితులందరికీ న్యాయం జరగాలని ఆమె కోరారు. మమత రాకతో కోర్టు ప్రాంగణం అంతా సందడిగా మారింది. ఇక, మమతా అటు కోర్టులో చేస్తున్న వాదనలు.. రాజకీయంగా ఇటు బీజేపీతో చేస్తున్న పోరాటంతో తిరిగి పార్టీలో ఎంత వరకు జోష్ నింపుతారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications