Kacheguda–Visakhapatnam Train: రేపు కాచిగూడ నుంచి విశాఖ వెళ్తున్నారా ? ఇది మీకోసమే..!

హైదరాబాద్ నుంచి విశాఖకు రేపు (శుక్రవారం) వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య ఓ ప్రత్యేక రైలు నడుపుతోంది. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో రైళ్లలో అస్సలు బెర్తులు ఖాళీగా ఉండటం లేదు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో రేపు కాచిగూడ స్టేషన్ నుంచి విశాఖకు ఓ ప్రత్యేక రైలు (Kacheguda-Visakhapatnam Special Train) నడపాలని నిర్ణయించింది.

జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్..! వీటినీ కలపాలని కోరిన చంద్రబాబు..!
జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్..! వీటినీ కలపాలని కోరిన చంద్రబాబు..!

కాచిగూడలో ఈ ప్రత్యేక రైలు 07810 రాత్రి 8.45కు బయలుదేరుతుంది. ఈ రైలు ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇది కేవలం వన్ వే ట్రైన్. ఈ రైలుకు మల్కాజ్ గిరి, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్లలో మాత్రమే పరిమిత స్టాప్ లు ఇచ్చారు. మిగిలిన స్టేషన్లలో స్టాప్ లు ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.\

Kacheguda Visakhapatnam Special Train Runs Tomorrow With Limited Stops
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ ప్రత్యేక రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి రేపు శుక్రవారం అత్యవసర ప్రయాణాలు చేసే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది. ఈ రైలుతో పాటు మరికొన్ని ఇప్పటికే ప్రకటించిన రైళ్లు సైతం హైదరాబాద్-విశాఖ మధ్య అందుబాటులో ఉన్నాయి. వాటీలో టికెట్లు దొరకని వారు ఇందులో బుక్ చేసుకోవచ్చు. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్న తరుణంలో విశాఖ వంటి దూర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు ఇది కచ్చితంగా ఉపయోగపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+