ఏపీ లో కొత్త పెన్షన్లు మంజూరు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది తో లబ్ది దారుల వద్దకే పెన్షన్ మొత్తాన్ని అందిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. కాగా.. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు దారులు వేచి చూస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి కే ప్రభుత్వం వద్ద పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ ఆర్దిక పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం వీటి మంజూరు విషయంలో నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా, రాష్ట్రంలో కిడ్నీ,లివర్, హార్ట్ బాధితులకు కొత్తగా 895 పెన్షన్లు మంజూరుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందు కోసం ప్రభుత్వం పైన ప్రతీ నెలా రూ 86 లక్షల అదనపు భారం పడనుంది. దీర్ఘ కాలిక వ్యాధి తో బాధ పడుతున్న వారికి ఊరట ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించింది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
ప్రభుత్వం ఇప్పటికే వితంతు పెన్షన్ల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. వితంతువుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా లక్ష మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరున్నర లక్షల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. వీరిలో లక్ష మంది వరకూ అనర్హులు ఉన్నారని వైద్యాధికారులు తేల్చారు. వీరిని తొలగించి కొత్తగా అర్హులకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే మిగిలిన కేటగిరీల వారికి కూడా పెన్షన్ల మంజూరుకు అధికారులు లెక్కలు సిద్దం చేస్తున్నారు. కొత్త పెన్షన్ల జారీ ప్రారంభిస్తే 10 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, వీరికి నెలకు 400 కోట్ల చొప్పన ఏడాదికి 4800 కోట్ల భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.













Click it and Unblock the Notifications