ఏ చిన్న అనారోగ్యమైనా యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా? ఎంత డేంజర్ అంటే

యాంటీబయాటిక్స్ .. ప్రస్తుతం మన సమాజంలో యాంటీబయాటిక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం అనేక అనారోగ్య సమస్యలకు, ఆరోగ్య ప్రమాదాలకు కారణంగా మారుతుంది. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి, వాటిని ఉపయోగించడం వల్ల వారిలో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

యాంటీ బయాటిక్స్ విపరీతమైన వాడకం.. ఆరోగ్య ముప్పు

ఇక గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేని ఆర్ఎంపీ వైద్యులు చిన్న చిన్న అనారోగ్యాలకు చాలా ఎక్కువ డోసేజ్ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. ఇది కూడా వారిలో యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ కు కారణం అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే పనిచేయని పరిస్థితి చోటు చేసుకుంటుంది. ప్రజల ఆరోగ్యానికి పెరుగుతున్న అతిపెద్ద ఆందోళన.

Health risks of antibiotics misuse

యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ వస్తే కష్టం

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది బాక్టీరియా మార్పులు చెందినప్పుడు, మందుల ప్రభావాలకు ఇమ్యూన్‌గా మారినప్పుడు జరుగుతుంది. దీనివల్ల ఇతరత్రా వ్యాధులు సంక్రమించిన చికిత్స చేయడం కష్టం అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల యాంటీబయాటిక్స్ తో సొంత వైద్యం చేసుకుంటున్నారు. ప్రజలు తరచుగా డాక్టర్‌ను సంప్రదించకుండా స్థానిక దుకాణాల నుండి ఈ మందులను కొనుగోలుచేసి వాడడం కారణంగా భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

యాంటీ బయాటిక్స్ వల్ల మనకు తెలీకుండానే సైడ్ ఎఫెక్ట్స్

యాంటీ బయాటిక్స్ దుర్వినియోగం వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేయదు, ఇది ప్రజా ఆరోగ్యానికి విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. మనకు తెలియకుండానే మన శరీరంలో వివిధ సైడ్ ఎఫెక్ట్స్ కు యాంటీబయాటిక్స్ కారణమవుతున్నాయి. అందుకే యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేయటం బెస్ట్...

యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల వచ్చే సమస్యలను క్లిష్టంగా మారిన తర్వాత పరిష్కరించడం కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్ వినియోగం పైన, విక్రయం పై కఠినమైన నియంత్రణలు అవసరం. వైద్యులు, రోగులకు యాంటీబయాటిక్స్ తగిన విధంగా ఉపయోగించకపోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. గ్రామీణ ప్రాంతాలలో నేరుగా యాంటీబయాటిక్స్ కొనుక్కునే విధానాన్ని నియంత్రించాలి. సాధ్యమైనంతవరకు ఆరోగ్య సమస్యలను నాచురల్ గానే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+