health tips: ఇంట్లో ఉన్న పదార్ధాలతోనే సర్వరోగ నివారిణి.. ఇలా చేసి రిజల్ట్ చూడండి!!
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు కాకున్నా తరచూ అనారోగ్యంతో బాధపడేవారు ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కావలసిన సర్వరోగ నివారిణి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడే పదార్థాలు ఏమిటి? వాటిని ఎలా తయారు చేసుకొని, ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
సర్వరోగ నివారిణిగా మన ఇంట్లో ఉపయోగించుకునే కొన్ని పదార్థాలు పనిచేస్తాయి. అవి మెంతులు, వాము, నల్ల జీలకర్ర. ఈ మూడు పదార్థాలను కలిపి ఒక చూర్ణంగా తయారు చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకుని ప్రతిరోజు తీసుకుంటే కచ్చితంగా చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

250 గ్రాముల మెంతులు, 50 గ్రాములు నల్ల జీలకర్ర, 100 గ్రాముల వాము ను కలిపి వేరువేరుగా పెనంపై కొద్దిగా వేపి పొడిగా చేసుకుని గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.ఇక ఆ చూర్ణాన్ని ప్రతి రోజు భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూను చూర్ణాన్ని కలిపి తాగాలి. దీనిని తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి.
ప్రతీ రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విషపదార్థాలు మల,మూత్ర, చెమటల ద్వారా బయటకు పోతాయి. క్రమం తప్పకుండా 40 నుండి 50 రోజులపాటు ఈ పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలు ప్రతిరోజు ఈ చూర్ణాన్ని వాడితే ఆరోగ్యానికి తిరుగుండదని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ చూర్ణాన్ని వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోయి, ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీనివల్ల శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. శరీరం పై ఉన్న ముడతలు పోయి, శరీరం యవ్వనత్వం సంతరించుకుంటుంది. శరీరం బలంగాను, చురుకుగాను, ప్రకాశవంతంగానూ మారుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల సలహా మేరకే ఈ చూర్ణాన్ని వాడాలి.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications