Health tips: ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం అదేపనిగా తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా!!

ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం అదేపనిగా తింటున్నారా? ఎంత డేంజరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆ పని చెయ్యరు.

చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసుకొని తింటూ ఉంటారు. సహజంగా చాలామంది ఆడవాళ్లు అదేదో ఆదా చేసినట్టుగా కూరలు ఫ్రిజ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు తినేవారు కూడా ఉన్నారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని అలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్

ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్

చాలామంది రాత్రిపూట మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టుకొని మళ్లీ తర్వాత రోజు దానిని వేడి చేసుకుని తింటూ ఉంటారు.ఇలా తినటం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. పోషకాలు లేని ఆహారాన్ని తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఒక్కోసారి ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆహారాన్ని తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకొని తినడమే మంచిదని, ఫ్రిజ్లో నిలువ మించిన ఆహారాన్ని పదేపదే తినడం అనారోగ్యాలకు మూలమవుతుందని చెబుతున్నారు.

ఫ్రిజ్లో నిల్వచేసి తినడం వల్ల అజీర్ణం, డయేరియా

ఫ్రిజ్లో నిల్వచేసి తినడం వల్ల అజీర్ణం, డయేరియా


సాధారణంగా కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఫ్రెష్ గా ఉండడం కోసం ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. అయితే వాటిని మాత్రమే కాకుండా మిగిలిపోయిన కూరలు, అన్నం, ఇక రకరకాల పదార్థాలను ఫ్రిజ్లో నిల్వచేసి తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫ్రిజ్లో నిలువ మించిన ఆహార పదార్థాలను పదేపదే తినడం వల్ల డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పది రూపాయలు ఆదా చేశామని, రోగం వస్తే వేలకు వేలకు ఆస్పత్రులకు పెట్టే బదులు అలాంటి ఆహారం తినకుండా ఉండటమే మంచిది.

 ఫ్రిజ్ లో వీటిని పెట్టి తినకండి .. డేంజర్

ఫ్రిజ్ లో వీటిని పెట్టి తినకండి .. డేంజర్


ఎవరైనా వండుకునేటప్పుడు సరిపడా క్వాంటిటీని వండుకోవడమే మంచిదని, అలా కాకుండా ఎక్కువగా వండుకొని ఫ్రిజ్లో పెట్టుకొని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనము చేకూరదని చెబుతున్నారు. ఇక ఫ్రిజ్లో కొన్ని ఆహార పదార్థాలను పెట్టడం డేంజర్ అని చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్లను ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. బంగాళదుంపలను పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టకూడదని చెబుతున్నారు. ఒకవేళ అలా బంగాళదుంపలను ఫ్రిజ్లో పెట్టుకుని తర్వాత వండుకు తింటే కండరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఫ్రిజ్ ఖాళీ లేకుండా పెడితే ఆహారాలు పాడయ్యే ప్రమాదం

ఫ్రిజ్ ఖాళీ లేకుండా పెడితే ఆహారాలు పాడయ్యే ప్రమాదం


ఇక ఫ్రిజ్లో అరటి పండ్లను కూడా పెట్టకూడదని, టమాటాలను పెట్టడం కూడా మంచిది కాదని, తేనె, బ్రెడ్ వంటి వాటిని కూడా ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. వెల్లుల్లి కూడా చాలా మంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదని అంటున్నారు. కాఫీ పౌడర్ వంటివి గడ్డ కడతాయని, పప్పులు, రవ్వలు పాడై పోతాయని ఫ్రిజ్ లో పెడతారు. కానీ అలా పెట్టకూడదు, ఫ్రిజ్ ఖాళీ లేకుండా పెడితే అందులో ఉన్న మిగతా ఆహార పదార్ధాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఫ్రిజ్ లో ఖాళీ ఉండేలాగా పెట్టుకోవాలి. మరీ ప్రతీ ఒక్కటి పెట్టి నింప కూడదు. ప్రతీది ఫ్రీజర్ లో ఉండే ఆహరం తినకూడదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+