health tips: కీళ్ళవాతంతో జాగ్రత్త.. తినాల్సినవి, తినకూడనివి ఇవే!!
ప్రస్తుతం చాలామంది కీళ్లవాతంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. కీళ్లవాతం జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే, జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటే వస్తుంది. అయితే కీళ్లనొప్పులతో బాధపడేవారు కొన్ని ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
కీళ్ల వాతంతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అని చెబుతున్నారు. కీళ్ల వాతంతో బాధపడేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలని అంటున్నారు . మాంసాహారం కీళ్లవాతాన్ని పెంచుతుందని, కనుక మాంసాహారాన్ని బాగా తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు దుంపకూరలు తినకూడదు అని చెబుతున్నారు. ఆలుగడ్డలు, కంద, చిలగడదుంప లాంటి దుంప కూరలు తినడం మంచిది కాదని, ఇవి నొప్పులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలు, పెరుగు బాగా తగ్గించాలని, పాలు, పెరుగు కీళ్ళ నొప్పులతో బాధ పడే వారి నొప్పులను మరింత పెంచుతాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు బఠానీ లకు దూరంగా ఉండాలి. శనగపిండి, మైదా పిండి వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను తినకుండా ఉండాలి. వీటిని తినడం వల్ల ఇవి ఆలస్యంగా జీర్ణమై, శరీరంపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు పులుపులేని ఆకుకూరలను, కూరగాయలను తింటే మంచిదని చెబుతున్నారు. ఆకుపచ్చ రంగు ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, వీటిలో ఎముకలకు బలాన్నిచ్చే పొటాషియం, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి అని చెబుతున్నారు. అంతేకాదు ముల్లంగి, క్యారెట్, కాలీఫ్లవర్ కూడా నొప్పులు బాగా తగ్గిస్తుందని అంటున్నారు.
బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, గుమ్మడికాయ వంటి వాటితో కూడా శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ధనియాలు, జీలకర్ర, వాము, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, సొంఠీ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని, అవి నొప్పులను వాపులను బాగా తగ్గిస్తాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ లను ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications