Health tips: పెరుగు బీపీని కంట్రోల్ చెయ్యటమే కాదు ఇంకేం చెయ్యగలదో తెలుసా!!

భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. భారతీయులు చాలావరకు తమ ఆహారంలో పెరుగును తీసుకుంటారు. ఒత్తిడిని తగ్గించి శక్తినిచ్చే ఆహారంగా పెరుగును చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది యువత పెరుగును తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. కానీ పెరుగులో ఉండే మహత్తు తెలిస్తే వారు కూడా రోజూ పెరుగును ఖచ్చితంగా తింటారు.

పెరుగులో ఉండే పోషకాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. పెరుగులో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి 6, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉంటాయి. పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల అది దంతాలకు మరియు ఎముకలకు ఎంతో బాగా పనిచేస్తుంది. ఎముకలను పెరుగు బలోపేతం చేస్తుంది.

Health tips: Curd Controls BP, reduces stress and many more.. here are the details!!

శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు అనేక ఇతర పోషకాలు కూడా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక స్పూను పెరుగు తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడు బాగా పని చేస్తుంది. పెరుగు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. పెరుగు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

పెరుగు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పెరుగు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాలికల్స్ నుంచి చర్మాన్ని మృదువుగా చేయడానికి పెరుగు పనికొస్తుంది.

ప్రతిరోజూ పెరుగును మధ్యాహ్నం పూట ఒక కప్పు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగు తినడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి. పెరుగు చర్మం యొక్క అందాన్ని కూడా పెంచడానికి పలు రకాలుగా పనిచేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది. కాబట్టి పెరుగు తినడం ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ పెరుగు తినాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+