Health tips: డయాబెటిస్, మెదడు, నరాల ఆరోగ్యానికి మిరియాలు మేలు..ఎలాగంటే!!
మిరియాలు ఆహారం యొక్క రుచిని పెంచడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మసాలా దినుసుల రారాజుగా చెప్పే మిరియాలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మిరియాలను నిత్యం ఆహారంలో ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల చాలా రోగాలు దూరమవుతాయని అంటున్నారు.
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మిరియాలను తినడం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నరాల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మిరియాలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే అవి తీవ్రమైన క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారు మిరియాలను కచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు క్రమ పద్ధతిలో మిరియాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మిరియాలు తినడం పొట్ట ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణ సంబంధితమైన వ్యాధులు ఉన్నవారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను మిరియాలు తగ్గిస్తాయి. అంతేకాదు మిరియాలు యాంటీసెప్టిక్ గా కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. జలుబు,దగ్గు వంటి అనేక అనారోగ్యాలకు మిరియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. రోగనిరోధక శక్తిని మరింత పెంచే మిరియాలు నిత్యం తీసుకోవడం కచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే మిరియాలే కాదు మరే ఇతర పదార్ధం అయినా అతిగా తీసుకుంటే దుష్ఫలితాలు వస్తాయి. మితంగా క్రమ పద్దతిలో వాడితే కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు. సుగంధ ద్రవ్యాల రారాజు అయిన మిరియాలు ఆరోగ్యాన్ని ఇవ్వటంలోనూ అదే విధంగా పని చేస్తాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు వైద్య నిపుణులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications