health tips: పండ్లు తినండి కానీ ఈ పండ్ల కాంబినేషన్ అస్సలే తినకండి!!
ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు పండ్లు తినాలని చెబుతారు. అయితే పండ్లను ఆహారంగా తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తాము ఏ పండ్లు తినవచ్చు? ఏమి తినకూడదు? అనే విషయాన్ని తెలుసుకొని తదనుగుణంగా పండ్లను తినాలి. ఇక అంతే కాదు కొన్ని రకాల పండ్ల కాంబినేషన్ ను పొరపాటున కూడా కలిపి తినకూడదు. మన శరీరానికి హాని చేసే పండ్ల కాంబినేషన్ ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ పండు, అరటిపండును కలిపి పొరపాటున కూడా తినకూడదు. ఈ రెండు పండ్లను కలిపి తింటే ఎసిడిటీ సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు తలనొప్పికి కూడా ఈ రెండు పండ్ల కాంబినేషన్ కారణమవుతుంది. బొప్పాయి పండు నిమ్మకాయ లను పొరపాటున కూడా కలిపి తీసుకోకూడదు. ఒకటేసారి బొప్పాయి పండును, నిమ్మకాయను కలిపి తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. రక్తహీనత కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

నారింజ మరియు క్యారెట్ లను కలిపి తినడం మానుకోవాలి. ఆరెంజ్, క్యారెట్ కలయిక గుండెలో మంట, పిత్త సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. ఇది శరీరంలో మూత్రపిండాల సమస్యలు కూడా కలిగిస్తుంది. దానిమ్మ మరియు నేరేడు పండ్లను పొరపాటున కూడా కలిపి తినకూడదు. ఇవి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కావడంతో వీటిని కలిపి తీసుకుంటే ఎసిడిటీతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే దానిమ్మ, ఆప్రికాట్లను కలిపి తినకూడదు. వీటిని కలిపి తీసుకుంటే ఎసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే అధిక చక్కెర ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్ లను నాశనం చేస్తాయి. ఇక అంతేకాదు నారింజతో పాలు, నారింజతో పుడ్డింగ్, అరటిపండుతో పుడ్డింగ్ కాంబినేషన్లు, పండ్లతో స్వీట్లను కలిపి తిన్నా కూడా అనారోగ్యం కలిగిస్తాయి. కూరగాయలతో కూడా పండ్లను కలిపి తినకూడదు. ఒకవేళ అలా తింటే ఈ కాంబినేషన్ త్వరగా జీర్ణం కాదు. దీంతో శరీరంలో టాక్సిన్స్ విడుదల జరిగి శరీరానికి హాని కలుగుతుంది.
disclaimer: ఈ కథనం ఆహార నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications