వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పచ్చిమిరపకాయలతో ఎన్ని ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చో తెలుసా!!

|
Google Oneindia TeluguNews

పచ్చిమిరపకాయలు.. దైనందిన జీవితంలో మనం చేసే వంటల్లో పచ్చిమిరపకాయలను కచ్చితంగా వాడుతూ ఉంటాం. అటువంటి పచ్చిమిరపకాయలలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని మీకు తెలుసా.. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలియజేయడం కోసమే ఈ కథనం..

పచ్చి మిర్చిలో బోలెడు పోషకాలు

పచ్చి మిర్చిలో బోలెడు పోషకాలు


చాలామంది ఆహారంలో పచ్చిమిరపకాయ ముక్క వస్తే దాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. అయితే పచ్చిమిరపకాయలు తినడం ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. పచ్చిమిరపకాయలలో విటమిన్ ఏ, విటమిన్ బి 6, విటమిన్ సి, ఐరన్, కాపర్, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. పచ్చిమిరపకాయలలో బీటా కెరోటిన్, లుటిన్ జియాక్సంథిన్, క్రిప్టోక్సాంటిన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పచ్చిమిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకుని తింటే మంచిదని చెప్తున్నారు. అయితే చాలా ఎక్కువగా పచ్చిమిరపకాయలను తినడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని చెప్తున్నారు.

పచ్చి మిర్చితో బరువుకు, క్యాన్సర్ కు చెక్

పచ్చి మిర్చితో బరువుకు, క్యాన్సర్ కు చెక్

ఇక పచ్చిమిరపకాయల వల్ల మన ఆరోగ్యానికి కలిగి మేలును చూసినట్లయితే, పచ్చిమిరపకాయలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామంది ఊబకాయం కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు ఎండుకారానికి బదులుగా పచ్చిమిరపకాయలు కారంతో కూరలు వండుకొని తింటే మంచిదని, ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. పచ్చిమిరపకాయలతో క్యాన్సర్ సమస్యకు చాలా వరకు దూరంగా ఉండొచ్చని, పచ్చిమిరపకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడతాయని చెబుతున్నారు.

పచ్చి మిర్చితో జీర్ణ వ్యవస్థ, గుండెకు మేలు

పచ్చి మిర్చితో జీర్ణ వ్యవస్థ, గుండెకు మేలు

అంతేకాదు పచ్చిమిరపకాయలు జీర్ణ వ్యవస్థను సజావుగా నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పచ్చిమిరపకాయలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఇతర సమస్యల నుండి గుండెకు రక్షణ కల్పించడానికి పచ్చిమిరపకాయలు ఎంతగానో పనిచేస్తాయని చెప్తున్నారు. పచ్చి మిర్చి వల్ల 50 శాతం జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. పచ్చిమిరపకాయలలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. పచ్చిమిరపకాయలు చర్మాన్ని సంరక్షించడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

పచ్చి మిర్చితో రక్తపోటు నియంత్రణ

పచ్చి మిర్చితో రక్తపోటు నియంత్రణ


పచ్చిమిరపకాయలతో రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని రక్తపోటును తగ్గించడానికి పచ్చిమిరపకాయలు ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు. పచ్చిమిరపకాయల్లో ఉండే బీటకెరోటిన్ విటమిన్ వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగు పడటానికి కూడా పచ్చిమిరపకాయలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరచడానికి బీటా కెరోటిన్ ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతున్నారు. స్త్రీలకు కావలసిన విటమిన్ కే పచ్చిమిరపకాయలలో పుష్కలంగా ఉంటుంది.

పచ్చి మిర్చి అధిక వినియోగం మంచిది కాదు

పచ్చి మిర్చి అధిక వినియోగం మంచిది కాదు

పచ్చిమిరపకాయలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి, ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. పచ్చిమిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్ఫెక్షన్లు తొలగిస్తాయి. కనుక పచ్చి మిరపకాయలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా పచ్చి మిర్చిని నిత్యం ఆహారంలో భాగం చేసుకొండి. ఇదే సమయంలో అధికంగా వినియోగం మంచిది కాదని గుర్తించి మితంగా మాత్రమే ఆహారంలో తీసుకోండి. లేదంటే కడుపులో మంట వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Beauty tips: ముఖంపై ముడతలు పోవటానికి బొటాక్స్ ను మించిన సహజ చిట్కాలు ఇవే!!Beauty tips: ముఖంపై ముడతలు పోవటానికి బొటాక్స్ ను మించిన సహజ చిట్కాలు ఇవే!!

English summary
If you know how many health problems can be prevented with green chillies, you will definitely make green chillies a part of your diet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X