నేరేడు పండ్లు తింటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!!
వర్షాకాలం వచ్చిందంటే చాలామంది నేరేడు పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తారు. నేరేడు పండు సీజనల్ ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వేసవికాలంలో మామిడి పండ్ల కోసం చూసే జనాలు వర్షాకాలం రాగానే నేరేడు పండ్ల కోసం చూస్తారు. నేరేడుపండ్లలో అనేక పోషకాలు మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
నేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు
అయితే నేరేడు పండ్లను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
నేరేడు పండు తిన్న వెంటనే చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు లేదా పాలు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా సరే నేరేడు పండు తిన్న తర్వాత 40 నిముషాల తర్వాత మంచి నీళ్లు త్రాగడం మంచిదని సలహా ఇస్తున్నారు.

నేరేడు పండ్లు అతిగా తింటే జరిగేదిదే
అంతేకాదు నేరేడు పండు ఎక్కువగా తింటే కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నేరేడు పండ్లను ఎక్కువగా తినడం వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కొందరికి నేరేడు పండు ఎక్కువగా తింటే అతిసారం, విరోచనాలు వంటి సమస్యలు రావచ్చని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
వీరు నేరేడు పండ్లు ఎక్కువ తినకూడదు
చాలామంది జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది అటువంటి వారికి జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా నేరేడు పండ్లు తింటే కడుపుబ్బరం సమస్య వస్తుంది. ముఖంపై మొటిమలు పెరగడానికి నేరేడు పండ్లు కారణమవుతాయి అని కూడా చెబుతున్నారు. కనుక నేరేడు పండు తినే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
నేరేడుపండ్లు డయాబెటిస్ ఉన్నవారికి మంచిదే.. కానీ జాగ్రత్త
నేరేడు పండ్ల లో షుగర్ ని తగ్గించే గొప్ప లక్షణాలు ఉంటాయి. అలా అని షుగర్ పేషెంట్స్ నేరేడు పండ్లను అతిగా తినకూడదు అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. కనుక సీజనల్ ఫ్రూట్ అయిన నేరేడు పండును తినే విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ల సలహా తీసుకొని మరీ పండ్లు తినండి. ఏదైనా పరిమితంగా తిన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వెంటపడి వస్తాయి అందుకే జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications