health tips: మధుమేహం బాధితులు ఈ పండ్లు తినటం విషంతో సమానం!!
మధుమేహం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. దాదాపు ప్రపంచంలో సగం జనాభా ఎక్కువగా మధుమేహం బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సరైన జీవనశైలి లేకపోవడం, విపరీతమైన ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.
ఇక డయాబెటిస్ వచ్చిందంటే దానితో పాటు అదనంగా మరి కొన్ని రోగాలను తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్టు గుర్తించాలి. ఇక డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా వారి జీవితకాలమంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు.

ఏది తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని, షుగర్ లెవెల్స్ పెంచే ఆహారమా, కాదా అన్నది తెలుసుకుని తినాలి. ముఖ్యంగా పండ్ల విషయంలో కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తినకూడని పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లను ఎక్కువగా తినకూడదు. అరటి పండులో షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ బాధితులు అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు.
రోజుకి ఒక్క పండు అది కూడా ఉదయం సమయంలో మాత్రమే తినాలి. డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లను తినకూడదు. సీజన్లో వచ్చే మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు మామిడిపండ్ల కు దూరంగా ఉండాలి. డయాబెటిక్ బాధితులు పైనాపిల్ తినకూడదు . ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు మధుమేహంతో పోరాడతాయి.
అయినప్పటికీ మధుమేహం బాధితులు పైనాపిల్ ఎక్కువగా తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. మధుమేహం బాధితులు ద్రాక్ష పండ్లను తినకుండా ఉండాలి. ద్రాక్షపండ్లలో కూడా గ్లూకోజ్ స్థాయిని పెంచే గుణం ఉంటుంది కాబట్టి ద్రాక్ష పండ్ల కు దూరంగా ఉండాలి. మధుమేహం బాధితులు సపోటా లకు దూరంగా ఉండాలి. సపోటా పండు కూడా డయాబెటిస్ ను ఎక్కువ చేస్తుంది కాబట్టి తినకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications