ఫుడ్ పాయిజన్ కారణాలు.. లక్షణాలు; ఎవరు తరచుగా ఫుడ్ పాయిజన్ తో బాధపడతారు!!
మనం తినే ఆహారం ఎందుకు కలుషితం అవుతుంది? మనం తినే ఆహారం కలుషితం అయితే కనిపించే లక్షణాలు ఏమిటి? ఎందుకు కొంతమందిలో తరచూ ఫుడ్ పాయిజన్ అవుతుంది ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తినే ఆహారం సరిగ్గా వండకపోయినా, వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ ఉంచినా, ప్యాక్ చేసిన ఆహారాన్ని సరైన టెంపరేచర్ లో నిల్వ చేయకున్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది.
వేడి ఆహారాన్ని వెంటనే చల్లార్చటం, చల్లని ఆహారాన్ని ఒకేసారి వేడి చేయటం చేసినా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇంకా ఫుడ్ పాయిజన్ కు అపరిశుభ్ర వాతావరణం, చేతులలో ఉండే అపరిశుభ్రమైన బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు. ఇక ఫుడ్ పాయిజన్ అయితే లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే.. ఫుడ్ పాయిజన్ అయిన వారికి ప్రారంభ సంకేతాలుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

వికారంగా ఉండటం, వాంతులు కావటం, విరేచనాలు కావటం, కాళ్ళు చేతులు లాగటం, విపరీతమైన కడుపునొప్పి, అప్పుడప్పుడూ కడుపు మెలిపెడుతునట్టు నొప్పి కలుగుతాయి. అంతేకాదు ఫుడ్ పాయిజనింగ్ వలన తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన దాహంగా ఉండటం, తరచూ విరేచనాల వలన డీ హైడ్రేషన్, మూత్ర విసర్జన తగ్గటం , జ్వరం రావటం, చలిగా అనిపించటం, కండరాల నొప్పి, శక్తి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కళ్ళు తిరగటం, చూపు మందగించటం, నరాల బలహీనత, ఆకలి లేకపోవటం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎవరికి అవుతుంది.. అంటే బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వారికి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వారు వ్యాధి నిరోధక శక్తి లేకపోవటం వలన ఏ చిన్న బ్యాక్టీరియా దాడి చేసినా అస్వస్థతకు గురవుతారు.
ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. మధుమేహం, కాలేయ వ్యాధి, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, హెచ్ ఐ వీ తో బాధ పడేవారికి చాలా త్వరగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వుంది.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications