పెరుగులో ఉప్పు కలుపుకుంటున్నారా? అయితే..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వాటితోపాటు ప్రతిరోజు మనం తీసుకున్న ఆహారం, నీళ్లపై కూడా దృష్టి నిలపాలి. ఒక్కోసారి మనం చేసే పొరపాటు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కొన్ని కలపకూడనివి కలిపి తినడంవల్ల అది విషంగా మారుతుంది. ముఖ్యంగా పెరుగుతో ఏమేమి కలిపి తినకూడదో తెలుసుకుందాం.
పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని, కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మరణిస్తుంది. దీనివల్ల పెరుగు తీసుకొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ ఎంతోమంది చెబుతుంటారు. కానీ ఇందులో అసలు వాస్తవమే లేదు. పెరుగులో ఉప్పు కలుపుకున్న తర్వాత కూడా విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఉప్పు కంటే ప్రమాదకరమైందైన లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల చేస్తుంది. అన్ని రకాల బ్యాక్టీరియాలను ఇది నాశనం చేస్తుంది. అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని చక్కగా తినొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

అయితే పెరుగుతో పాటు కలిపి తినకూడని పదార్థాలు కొన్నివున్నాయి. నెయ్యిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఆహారం జీర్ణమవదు. అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గుండెల్లో మంట, కడుపులో ఉబ్బరం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగులో తీపి, పుల్లటి గుణాలుంటాయి. శరీరంలో కఫదోషాన్ని పెంచుతాయి. రాత్రి వేళ మన శరీరంలో కఫం ప్రాబల్యం ఉంటుంది. దీనివల్ల ముక్కు భాగాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. దగ్గు, ఆస్తమా, జలుబు చేసేవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.












Click it and Unblock the Notifications