health tips: బరువును బట్టి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి.. లెక్కలు తెలుసుకోండి!!

సాధారణంగా శరీరానికి కావలసిన మోతాదులోనే నీటిని తాగాలి. అయితే చాలా మంది నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యం అని భావిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని తాగాల్సిన అవసరం ఉన్న మాట నిజమే అయినప్పటికీ, అధికంగా నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అధికంగా నీటిని తాగడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. మీరు ఎక్కువగా నీటిని తాగడం ప్రమాదకరమని ఓవర్ హైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మన శరీరం బరువు ఎంత ఉంది? మనం ఎన్ని నీళ్లు తాగాలి ? అనేది తెలుసుకొని తదనుగుణంగా నీటిని తాగాలని చెబుతున్నారు.

health tips

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం వల్ల డైల్యూషనల్ హైపోనాట్రేమియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే మనం ప్రతిరోజూ ఎన్ని నీళ్ళని తీసుకోవాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం మనం ఎన్ని నీళ్లు తాగాలి అనేదానికి ఒక గణన ఉంటుంది.

ముందు మీ శరీర బరువును తెలుసుకుని, ఆ శరీర బరువును 30 ద్వారా భావిస్తే వచ్చే ఫలితం మీ శరీరానికి అవసరం ఆయన త్రాగు నీటి పరిమాణంగా ఉంటుంది. ఉదాహరణకు 60 కిలోల బరువున్న వ్యక్తి ఎన్ని నీళ్లు తాగాలి అంటే.. 60ను 30 తో భాగిస్తే రెండు వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి రెండు లీటర్ల నీటిని తాగితే సరిపోతుంది.

శరీర బరువును బట్టి తీసుకోవలసిన నీటి పరిమాణం కంటే ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువ నీరు తాగకుండా, అవసరాన్ని బట్టి మన శరీర బరువును బట్టి నీళ్ళను తాగితే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+