health tips: సిరి ధాన్యాలు కొర్రలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇంతింత కాదయా!!
చిరు ధాన్యాలు కొర్రలను మనం నిత్యం ఆహారంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రస్తుతం భారతదేశం ఊబకాయంతో బాధపడుతుంది. రోజురోజుకీ ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించాలని చాలామంది డైటీషియన్లు చెబుతున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారే ఆహారంలో చిరుధాన్యాలను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందటమే కాకుండా రోగ కారకాలు కూడా తొలగిపోతాయని, ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు.

ఆహారంలో భాగంగా సిరి ధాన్యాలు.. ఆరోగ్యానికి వరాలు
అద్భుతమైన సహజ ఆహార ధాన్యాలుగా చెప్పబడే ప్రకృతి ప్రసాదించిన చిరుధాన్యాలు.. నిజంగా చెప్పాలంటే మన ఆరోగ్యానికి సిరి ధాన్యాలు. వీటితో బరువు తగ్గడమే కాకుండా మనిషి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పోషకాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు సమానంగా అందుతాయి.
మనం తీసుకునే అన్నంలో కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండి అవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. వ్యాయామం లేకపోవడంతో పాటు, పెరుగుతున్న పని వత్తిడి, మారుతున్న జీవనశైలి కారణాలతో మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అందుకే అన్నానికి బదులు సిరిధాన్యాలను తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

కొర్రలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ముఖ్యంగా సిరి ధాన్యాల గురించి చెప్పుకుంటే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండ్రు కొర్రలు, రాగులు ముఖ్యమైనవి. ఇక కొర్రల విషయానికి వస్తే కొర్రలలో పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఉంటాయి. నలుపు, తెలుపు రంగులు ఉన్న కొర్రలు శ్రేష్టమైనవిగా చెబుతూ ఉంటారు. కొర్రలను మనం నిత్యం ఆహారంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొర్రల వల్ల నరాల శక్తి పెరుగుతుంది. మానసిక దృఢత్వం కలుగుతుంది. ఆర్థరైటిస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

కొర్రలతో ఈ సమస్యలకూ చెక్
పార్కిన్సన్, మూర్చ వంటి రోగాల నుండి విముక్తి కలుగుతుంది. కొర్రలు మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయడానికి చక్కగా దోహదం చేస్తాయి. జీర్ణశక్తిని పెంచి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొర్రలు ఎముకల పట్టుత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నడుం నొప్పితో బాధపడే వారు కొర్రలు తిన్నట్లయితే నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నడుము బలపడుతుంది.

అతిగా కొర్రలు తింటే జరిగేదిదే ..
అయితే కొర్రలను అతిగా తినడం వాతాన్ని పెంచుతుంది. కొర్రలు విపరీతంగా శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే కొర్రలను తినే విషయంలో జాగ్రత్త వహించాలి. మధుమేహం ఉన్నవారికి కూడా కొర్ర అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. మధుమేహం తగ్గించడానికి కొర్రలు అన్నంగా వండుకుని తగినంత కూరలు కలుపుకొని, అలాగే మజ్జిగతోనూ తింటే మంచిది.
కొర్రలు తినేవారిలో కఫ సంబంధమైన సమస్యలు, జ్వరాలు త్వరగా తగ్గుతాయి. శరీరానికి పుష్టిని ఇచ్చే కొర్రలు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం డైటీషియన్లు, వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications