health tips: కళ్ళలో ఈ సంకేతం ఉంటే మధుమేహం ఉన్నట్టే!!

డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు సగం మంది డయాబెటిస్ బారినపడి బాధపడుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, విపరీతమైన పని ఒత్తిడి పెరగడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలు చాలామందిని డయాబెటిస్ బాధితులుగా మారుస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ బారినపడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

అయితే డయాబెటిస్ జలుబు, జ్వరం వంటి సమస్యలలాగా బయటకు కనిపించదు. కానీ శరీరంలో డయాబెటిస్ ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు మాత్రం స్పష్టంగా తెలుస్తాయి. ఇక ఎటువంటి లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాలి వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డయాబెటిస్ లో రక్తంలో చక్కెర లెవల్స్ ఎక్కువగా ఉండటం ప్రాణాంతకం అవుతుంది. మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ మీద వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు ఎప్పుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త గానే ఉండాలి.

 health tips: If you have this sign in your eyes, your diabetes is not under control!!

శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరం అనేక సంకేతాలను ఇస్తుంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులలో అస్పష్టమైన దృష్టి రక్తంలో చక్కెర లెవెల్స్ ఎక్కువగా పెరిగాయి అని చెప్పడానికి సంకేతం. చూపు మందగించి, ఎదురుగా ఉన్న వస్తువులు బ్లర్ గా కనిపిస్తే డయాబెటిస్ బాధితులు వారికి డయాబెటిస్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాలి. కళ్ళల్లో సమస్య వచ్చిందంటే డయాబెటిస్ పెరిగిపోయిందని అర్థం.
అంతేకాదు షుగర్ వ్యాధి బాధితుల కాళ్లలోని నరాలను దెబ్బతీస్తుంది.

పాదాలలోని నరాలు విపరీతంగా బాధిస్తుంటే, పాదాలలో నొప్పి మరియు మంటలు వంటి భావన కలిగితే డయాబెటిస్ పెరిగినట్టుగా అర్థం చేసుకోవాలి. పంటి చిగుళ్ల సమస్యలు వచ్చినా డయాబెటిస్ పెరిగిందని గుర్తించాలి గుర్తించాలి. రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల రోగి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ బాధితులు గుండె జబ్బులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ పెరిగిందని శరీరంలో వచ్చే సంకేతాలను బట్టి గుర్తించి జాగ్రత్త పడాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+